టిఆర్ఎస్ కు ఝలక్… చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల సమయాన టిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. టిఆర్ఎష్ చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ కు రేవంత్ రెడ్డి వికర్ష్ చేశారు. కాంగ్రెస్ మహిళా నేత సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారకుండా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి రేవంత్ సబితతో భేటి అయ్యి చర్చించారు. రాహుల్ గాంధీ తో ఫోన్లో మాట్లాడించగ ఆయన ఢిల్లీ వచ్చి కలవాలని చెప్పినట్టు తెలుస్తోంది.

మంగళవారం సాయంత్రం రేవంత్ ఆద్వర్యంలో సబితా కార్తీక్ ఢిల్లిక వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వారు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది. అయితే రేవంత్ కంటే మందే సబితను ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి కలిశారు. కానీ వారి చర్చలు ఫలించలేదు.

సబితా ఇంద్రారెడ్డి వారి పై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. కేటిఆర్ తో గంటల పాటు ఎలా చర్చించారని నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టారని ఎందుకు ప్రశ్నించారని ఆమె ఉత్తమ్ ను నిలదీశారు. అయితే ఇదే సమయంలో రేవంత్ ఎంట్రీ ఇచ్చి సబితతో చర్చించారు. ఆమె పార్టీ మారకుండా ఒప్పించారు. వారి ముందే రాహుల్ తో మాట్లాడించారు. రేవంత్ రెడ్డి ఎంట్రీతో సీన్ మారిపోయింది. దీంతో టిఆర్ఎస్ కు షాక్ తగిలిందని నేతలు చర్చించుకుంటున్నారు.