Drinking Water: ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగుతున్నారా అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్లాస్టిక్ సంచుల నుంచి సీసాల వరకు జనాలు ప్లాస్టిక్ ను ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ బాటిల్ వాడకం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని తెలిసినప్పటికీ చాలా మంది ప్లాస్టిక్ ను అలాగే వినియోగిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సమ్మర్ కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలామంది తరచుగా నీళ్లు తాగుతూనే ఉంటారు. ఎండలకు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనల్ని మనం హైడ్రేట్ గా ఉంచుకోవాలి.

ఇందుకోసం నీళ్లను బాగా తాగాలి. అయితే చాలా మంది ఈ సీజన్ లో కూల్ వాటర్ నే ఎక్కువగా తాగుతుంటారు. ఇందుకోసం ప్లాస్టిక్ బాటిల్స్ ను నింపి ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. ఈ నీళ్లనే తాగేస్తుంటారు. కానీ ప్లాస్టిక్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల లేనిపోని రోగాలు వస్తాయి. అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వైద్యులు కూడా తరచూ ఎక్కువగా ప్లాస్టిక్ ని వినియోగించకూడదు అని చెబుతూ ఉంటారు. ఒకసారి ఉపయోగించిన వాటర్ బాటిల్స్ ని మళ్లీ మళ్లీ ఉపయోగించడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఒక బాటిల్ నీటిలో పావు మిలియన్ ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. అలాగే వీటిలో 10% మైక్రో ప్లాస్టిక్స్, 90% నానో ప్లాస్టిక్స్ ఉంటాయి.

మైక్రో ప్లాస్టిక్స్ మనిషి శరీరంలోని జీర్ణ, శ్వాసకోశ, ఎండోక్రైన్, పునరుత్పత్తి, రోగ నిరోధక వ్యవస్థలు వంటి ఎన్నో వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో మీరు తాగడం వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా ప్లాస్టిక్ బాటిల్ వేడికి గురైనప్పుడు డయాక్సిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఈ రసాయనం కారణంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ప్లాస్టిక్ బాటిల్ లో ఉండే థాలేట్ కూడా దీనికి ఒక కారణం అని కూడా చెప్పవచ్చు. ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే బీపీఏ హార్మోన్ల అసమతుల్యత కు కారణం అవుతుంది. బీపీఏ హార్మోన్ల అసమతుల్యత ను ప్రేరేపిస్తుంది. దీని వల్ల యుక్త వయస్సు కూడా త్వరగా వస్తుంది. అలాగే డయాబెటిస్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్లాస్టిక్ బాటిళ్లలోని వాటర్ ను తాగితే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. నిజానికి దీనిలో ఉండే ఉండే మైక్రోప్లాస్టిక్స్ మన రక్త ప్రసరణ లోకి వెళతాయి. కాబట్టి ఇక మీదట అయినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడకాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.