Akshaay Trutiya 2024: అక్షయ తృతీయ రోజు సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇలా అస్సలు చేయకండి?

మామూలుగా ప్రతీ ఏడాది వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథిని అక్షయ తృతీయగా జరుపుకుంటారు అన్న విషయం మనందరికి తెలిసిందే. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయను జరుపుకోనున్నారు. అయితే ఈ రోజు చాలా మంచి రోజు అని చాలామంది వారి సంపదను పెంచుకోవడానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి బంగారం వెండితో పాటు అనేక రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు.

ముఖ్యంగా లక్ష్మీ దేవికి ప్రీతి పాత్రమైన పనులతో పాటు కొని పనులకు దూరంగా ఉండడం మంచిది. చాలామంది తెలిసి తెలియక చేసి కొన్ని తప్పులు వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొనవచ్చు. మరి అక్షయ తృతీయ రోజున ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈరోజున చాలామంది బంగారం వెండి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున కొనుగోలు చేసే వస్తువుల విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే తెలిసి తెలియకుండా చేసే పనులతో పేదరికం బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ప్లాస్టిక్, అల్యూ మినియం లేదా స్టీల్ పాత్రలు లేదా వస్తువులను కొనుగోలు చేయకూడదు.

ఎందుకంటే ఈ వస్తువులను రాహువు ప్రభావితం చేస్తాడని చాలా మంది నమ్ముతారు. కొనుగోలు చేస్తే ప్రతికూలత, పేదరికం ఇంట్లోకి వస్తాయి. కాబట్టి ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. తెలియక కూడా ఇలాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఎవరికి డబ్బును అప్పుగా అస్సలు ఇవ్వకూడదు. ఇలా ఇవ్వడాన్ని ఆశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంటి లోని సిరి సంపదలు మరొకరికి దగ్గరకు వెళ్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడం చెడు శకునంగా పరిగణించాలి. ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగిన అది శుభప్రదంగా పరిగణించబడదు. అటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే లక్ష్మీ దేవి చీపురులో నివసిస్తుందని భావిస్తారు. అదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చడం అశుభం. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి కోపించి ఇంటిని వదిలి వెళ్ళవచ్చు. అంతే కాకుండా సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజున మధ్యాహ్నం తుడుచుకోండి.అలాగే ఈరోజున ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల పూజా స్థలం, ఇంట్లో డబ్బు నిల్వ ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి. లక్ష్మీదేవి అపరిశుభ్రమైన పరిసరాలను అస్సలు ఇష్టపడదు. కాబట్టి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ ధూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు. ఈ రోజున శుభ్రం చేసుకోక పోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూలత, దురదృష్టం వస్తుంది. ఈ రోజు ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి తులసి ఆకులను అస్సలు సమర్పించకూడదు.