Business Idea: సొంత ఊరిలో వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవి మీకోసమే?

ప్రస్తుత రోజుల్లో యువత ఆలోచన మారిపోయింది. ఉద్యోగుల వైపు కంటే ఎక్కువగా బిజినెస్ వైఫై అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా చదువులు ఉద్యోగాల పేరుతో పట్టణాలకు వెళ్లిన చాలా మంది మళ్లీ గ్రామాల బాట పడుతున్నారు. అలాగే ఉద్యోగం చేస్తున్న చాలామంది ఉద్యోగాన్ని మానేసి సొంతంగా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. పట్టణాల్లో గజిబిజీ జీవితాల కంటే ఉన్న ఊరిలో ఆదాయం పొందుతూ మరో నలుగురికి ఉపాధి కలిపించాలని అనుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా రకరకాల వ్యాపారాలను అన్వేషిస్తున్నారు.

మరి సొంత ఊర్లోనే ఉంటూ మంచి బిజినెస్ లు చేయాలని అనుకుంటున్నారా, అయితే ఈ బిజినెస్ ల గురించి తెలుసుకోవాల్సిందే. అందులో మొదటిది కోళ్ల ఫామ్. ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ వ్యాపారం మొదలు పెట్టాలంటే కొంత మొత్తంలో డబ్బులు అలాగే కాస్త స్థలం ఉండాలి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చికెన్‌ సెంటర్లు, రెస్టారెంట్ ల సంఖ్య పెరిగిపోతోంది. కాబట్టి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అలాగే సొంత ఊర్లో మంచి బిజినెస్ పెట్టాలి అనుకున్న వారికి టీ బిజినెస్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ప్రస్తుతం గ్రామీణ పట్టణ అని తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో టీ ఫ్రాంచైజీలు స్టార్ట్ అవుతున్నాయి.

కాబట్టి మంచి ఏరియాలో అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా టీ రేట్లు పెడితే మంచిగా లాభాలను పొందవచ్చు. వీటికి సమాంతరంగా స్నాక్స్‌ బిజినెస్‌ను కూడా ప్రారంభించవచ్చు. అలాగే సొంత ఊరీలో మంచి బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నా వారికి ఆయిల్ మిల్ కూడా ఒక చక్కటి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. సోయా బీన్స్, వేరుశెనగ, ఆవాల గింజల నుంచి నూనెను తీయడానికి గ్రామాల్లో ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని స్థానికంగా ఉన్న పట్టణాల్లో విక్రయించుకొని మంచి లాభాలను అర్జించవచ్చు. అలాగే మెడికల్ షాప్‌ కూడా మంచి బిజినెస్‌ ఐడియాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీరే స్వయంగా ఒక డాక్టర్‌ను ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ఒక మెడికల్‌ షాపును ఏర్పాటు చేసుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు.