Vivo X100 Series: వివో నుంచి మరో 3 కొత్త స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేయనుంది. ఆ వివరాల్లోకి వెళితే.. వివో నుంచి సరికొత్త 3 ఫోన్లు రాబోతున్నాయి. వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100s ప్రో వచ్చే వారం లాంచ్ కానుంది. వివో కొత్త హ్యాండ్‌ సెట్‌లను చైనా లోని ఆన్‌లైన్ స్టోర్‌ లో అడ్వాన్స్ రిజర్వేషన్‌ ల కోసం లిస్టు చేసింది.

అంతేకాకుండా వివో మూడు ఫోన్ల కలర్ ఆప్షన్లను కూడా వెల్లడించింది. వివో X100 అల్ట్రా, వివో ఎక్స్100 ఎస్, వివో ఎక్స్100 ఎస్ ప్రో ఎక్కువగా 16జీబీ ర్యామ్, 1టీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. అదనంగా, కొత్త వివో ఎక్స్100 సిరీస్ ఫోన్‌ల ధరలను కూడా రివీల్ చేశారు. ఇకపోతే ఈ వివో ఎక్స్100 అల్ట్రా ఫోన్, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో ఫోన్ లను మే 13న ప్రకటించనున్నట్లు కంపెనీ వెయిబోలో వెల్లడించింది. కాగా ఈ 3 ఫోన్‌లు ప్రస్తుతం చైనాలోని వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌లకు అందుబాటులో ఉన్నాయి.

వివో ఎక్స్100 అల్ట్రా ఫోన్, వివో ఎక్స్100ఎస్ ప్రో రెండూ మనకు స్పేస్ గ్రే, టైటానియం, వైట్ మూన్‌లైట్ వంటి కలర్ ఆప్షన్‌ లలో లభించనున్నాయి. అలాగే వివో ఎక్స్100ఎస్ స్పేస్ గ్రే, బ్లూ క్లౌడ్, టైటానియం, వైట్ మూన్‌లైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. వివో X100 అల్ట్రా ఫోన్, వివో ఎక్స్100ఎస్ ప్రో మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ లలో అందుబాటులో ఉంటాయి. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ల స్టోరేజ్ విషయానికి వస్తే..12జీబీ+ 256జీబీ, 16జీబీ+ 512జీబీ, 16జీబీ+ 1టీబీ వేరియంట్లు ఉన్నాయి. వివో ఎక్స్100ఎస్ 12జీబీ+ 256జీబీ, 16జీబీ + 256జీబీ, 16జీబీ + 512జీబీ, 16జీబీ+ 1టీబీ ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌లలో అందించనుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ధరల విషయానికి వస్తే… వివోX100 అల్ట్రా ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ సీఎన్‌వై 6,699 అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా ధర రూ. 77,500 ఉండ నుంది. వివో X100s మోడల్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 3,999 అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 46,200 గా ఉండనుంది. అదే వేరియంట్ వివో X100s ప్రో ధర సీఎన్‌వై 4,999 సుమారు రూ. 57వేలు ఉంటుంది. వివో X100 అల్ట్రా ఫోన్ మే 28 నుంచి విక్రయానికి రానుంది. అయితే, వివో X100ఎస్, వివో X100s ప్రో మోడల్స్ మే 17 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.