టిఆర్ఎస్ లో కలకలం (వీడియోలు)

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలకు మధ్య రసాభాసా జరిగింది. ఇటివల జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఓటమి పాలు కావడంతో ఓటమికి కారణం మీరంటే మీరేనని టిఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అసలు ఏం జరిగిందంటే..

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిగిన జలగం వెంట్రావు ఓటమి పాలయ్యారు. పార్టీ పరిశీలకుడు నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో టిఆర్ఎస్ నేతలంతా సోమవారం ఉదయం సమావేశమయ్యారు. పార్టీ ఓటమి పట్ల వారు చర్చించుకున్నారు. ఇదే సమయంలో జలగం వెంకట్రావు వర్గీయులు లేచి ఇతర కార్యకర్తల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 పార్టీలో ఉన్నవారే మోసం చేశారని వారి వల్లనే ఓటమి పాలు అయ్యామని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు మద్దతుగా జలగం వెంకట్రావు లేచారు. సొంత పార్టీలోనే నేతలే కుట్ర పన్ని తనను ఓడించారని ఆయన ఆగహం వ్యక్తం చేశారు.


టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ  తెలంగాణ అంతట గెలిచి కొత్తగూడెంలో ఎందుకు గెలవలేకపోయామో చెప్పాలన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించానని కానీ ఈ సారి ఓటమికి కారణమేంటో తనకు ఇప్పటికి కూడా తెలియడం లేదన్నారు. దీంతో కార్యకర్తలంతా రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరి పై మరొకరు తిట్ల దండకమెత్తుకున్నారు. ఇదంతా పరిశీలకుడు నరేష్ రెడ్డి ముందే జరిగింది. ఖమ ్మం ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని సస్పండ్ చేయాలని వారు డిమాండ్ చేశారుే. 

కుర్చీలు విరగ్గొట్టుకొని కొట్లాట జరిగే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడే ఉన్న పార్టీ పరిశీలకుడు నరేష్ రెడ్డి ఇరు వర్గాలను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పార్టీ అభ్యర్ధి ఓటమికి కారణమైన వారి పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీనివ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.  

తెలంగాణ అంతటా ప్రజలు టిఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పు ఇస్తే ఖమ్మంలో మాత్రం ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. 10 అసెంబ్లీ సీట్లకు గాను 9 అసెంబ్లీ సీట్లలో కూటమి అభ్యర్దులే విజయం సాధించారు. ఒక్క స్థానంలో మాత్రమే టిఆర్ఎస్ గెలిచింది.  కొత్తగూడెం నుంచి కూటమి అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావు గెలుపాందారు. జలగం వెంకట్రావు 2014 ఎన్నికల్లో భారీ మెజారిటితో గెలిచినప్పటికి ఇటివల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాని పై సమీక్ష సమావేశం నిర్వహిస్తుండగానే రసాభాస జరిగింది. అధికార పార్టీలో విభేదాలు రచ్చకెక్కడంతో ఖమ్మం రాజకీయాలలో ఒక్క సారిగా హాట్ టాపిక్ గా మారింది.  ఆందోళన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.