ట్రెండింగ్ అవుతున్న ‘పుష్ప’ సింగిల్‌ ప్రోమో లుక్‌!

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులతోపాటు మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప.. ది రూల్‌’ . ఈ మూవీ నుంచి మ్యూజికల్‌ అప్‌డేట్‌ ఇస్తూ ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో పుష్ప ను లాంఛ్‌ చేయగా.. నెట్టింట టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ఫుల్‌ సాంగ్‌ లాంఛ్‌ కంటే ముందు ఏదో ఒక లుక్‌ విడుదల చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్‌.

ఇండియా మాస్‌ సెన్సేషన్‌ పుష్పరాజ్‌ ఇక్కడ.. బ్లాక్‌ బస్టర్‌ సాంగ్‌తో స్వాగతం పలుకుదాం.. అంటూ సుమోలో నుంచి స్టైలిష్‌గా దిగుతున్న లుక్‌ పుష్ప పుష్ప సాంగ్‌ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతోపాటు బెంగాళీ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ లాంఛ్‌ చేసిన తాజా స్టిల్‌ ట్రెండింగ్ అవుతోంది.

ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సీక్వెల్‌లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోండగా.. ఫహద్‌ ఫాసిల్‌, జగదీష్‌ ప్రతాప్‌ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. పుష్ప ది రూల్‌ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్‌ కంపెనీ భూషణ్‌ కుమార్‌ టీ సిరీస్‌ దక్కించుకుంది.