జూబ్లీహిల్స్ లో నిర్వహించిన డ్రంకైన్ డ్రైవ్ లో కాంగ్రెస్ నేత మల్లు రవి కుమారుడు సిద్దార్ధ మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 65 లో పోలీసులు డ్రంకైన్ డ్రైవ్ నిర్వహిస్తుండగా అదే సమయంలో అటువైపు బెంజి కారులో కాంగ్రెస్ నేత మల్లు రవి కుమారుడు సిద్దార్థ్ వచ్చాడు. పోలీసులు వాహనం ఆపి తనిఖీలు నిర్వహించగా అతను మద్యం తాగినట్టుగా తేలింది. బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా76 బీఏసీ శాతం వచ్చింది. సిద్దార్థ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాహనాన్ని స్టేషన్ కు తరలించారు.
కాంగ్రెస్ నేత కుమారుడు వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కడంతో అదే సమయంలో మీడియా అక్కడ ఉండటంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అందరికి ఆదర్శంగా ఉండాలని చెప్పే రాజకీయ నేతలే తమ కుమారులను అదుపులో పెట్టుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గొప్పలు చెప్పటం కాదు ఆచరించి చూపించాలని ప్రత్యర్ది పార్టీల నేతలు అంటున్నారు.