కేటిఆర్‌ను కలిసిన బిజెపి రాజాసింగ్… వాట్ నెక్స్ట్

గోషామహాల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ శుక్రవారం కేటిఆర్ తో భేటి అయ్యారు.వీరిద్దరి కలయిక తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. రాజా సింగ్ కేటిఆర్ ను కలవడంతో అంతటా హాట్ టాపిక్ గా మారాడు. గోవద నిషేదం కోసం గోషామహాల్ ఎమ్మెల్యే పదవికి,  బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

అయితే ఇప్పుడు రాజా సింగ్ కేటిఆర్ తో సమావేశం కావడంతో ఆయన టిఆర్ ఎస్ లో చేరబోతున్నారా.. అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసెంబ్లీ రద్దు అయిన రోజే  కేసీఆర్ ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులలో గోషామహల్ అభ్యర్థిని ప్రకటించలేదు.  రాజా సింగ్ బిజెపికి రాజీనామా చేశారు కానీ ఇంకా ఏ పార్టీలో చేరలేదు. దానం నాగేందర్ కు గోషామహాల్ టికెట్ ఖరారు చేశారనే వార్తలు వచ్చాయి. కొద్ది రోజులుగా ప్రతిపక్ష నాయకుల పై  కేసులు నమోదవుతున్నాయి. ఎప్పుడో జరిగిన కేసుల విషయంలో నోటిసులు పంపి అరెస్టులు చేస్తున్నారు.

పోలీసులు రాజాసింగ్‌కు పంపిన నోటిసు ఇదే

గతంలో తిరంగా యాత్ర పేరుతో అనుమతి లేకుండా ర్యాలీ జరిపారనే  కేసులో ఇటీవల రాజాసింగ్ కు నోటిసులు అందాయి. ఇదే తరుణంలో ఆయన కేటిఆర్ ను కలిశారు. కేసు నుంచి బయటపడటానికా లేక టిఆర్ ఎస్ లోకి జంప్ కావడానికా అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా సాగుతుంది. మరోవైపు రాజా సింగ్ కు ఎంఐఎం అన్నా టిఆర్ ఎస్ అన్నా పడదు. ప్రస్తుతం టిఆర్ ఎస్ ఎంఐఎం పార్టీ తమకు ఫ్రెండ్లీ పార్టీ అని ప్రకటించింది. ఎమ్మెల్యేగా ఉన్న గత నాలుగేళ్ల కాలంలో ఎంఐఎంకి టిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ కేటిఆర్ ను ఎందుకు కలిశారని బిజెపి వర్గాల్లోను చర్చనీయాంశమైంది.