ఎంత కష్టమొచ్చింది శ్రీలీలకి.! వస్తుంది మరి.! బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ వస్తే అలాగే వుంటుంది పరిస్థితి. ఎందుకిలా.? తప్పంతా శ్రీలీలదేనా.? తప్పూ శ్రీలీలది కాదు.. ఘనత కూడా శ్రీలీలది కాదు. సినిమా అంటేనే వ్యాపారం.! కమర్షియల్ లెక్కలు తేడా కొడితే, ఫేట్ మారిపోతుంది.
పూజా హెగ్దేని కాదని ‘గుంటూరు కారం’ సినిమాలో శ్రీలీలని తీసుకున్నారు. సినిమా ఏమయ్యిందో తెలుసు కదా.? పూజా హెగ్దే వుంటే, ఒకింత ఇంట్రెస్టింగ్‌గా వుండి వుండేదేమో. పాత్రలన్నీ గజిబిజి అయిపోయాయి.
సరే, ఇప్పుడదంతా ఎందుకంటే, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో శ్రీలీల మార్కెట్ బాగా పడిపోయింది. ఎంత వేగంగా అయితే కెరీర్ పీక్స్‌కి వెళ్ళిందో, అంతే వేగంగా ఢమాల్ అయిపోయింది.
వాట్ నెక్స్‌ట్.? ఇంకేముంది.? సగానికి సగం రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సి వస్తోందట. సినిమాలకు మార్కెట్ పడిపోతున్న దరిమిలా, పెద్ద బ్యానర్లన్నీ కాస్ట్ కటింగ్ వైపు ఆలోచన చేయక తప్పడంలేదు.
ఆ క్రమంలో తొలుత కటింగ్ శ్రీలీలకి పడిందని అంటున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మరో మాట లేకుండా, శ్రీలీల కూడా తగ్గించుకోవడానికి ఒకే చెప్పేసిందట. ఏముంది.. ఓ హిట్టు కొడితే, మళ్ళీ లెక్కలు మారిపోతాయన్న ధీమాతో వుందిట శ్రీలీల. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ వుండాలి మరి.