సత్యదేవ్ కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్స్‌తో తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కృష్ణమ్మ’

సూపర్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తాజా చిత్రం ‘కృష్ణమ్మ’తో మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ చిత్రంగా ‘కృష్ణమ్మ’ మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను రిలీజ్ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేశాయి. సత్యదేవ్‌లో నటుడిని కొత్త కోణంలో ఈ చిత్రం ఆవిష్కరించింది. రగ్డ్ పర్సనాలిటీ, రస్టిక్ యాక్షన్ సన్నివేశాలతో సత్యదేవ్ ఆడియెన్స్ మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ‘కృష్ణమ్మ’ తొలి రోజునే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే తొలి 5 రోజుల్లో రూ. 5.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించటంతో సత్యదేవ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది ‘కృష్ణమ్మ’. తొలి ఆట నుంచే ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ తన విజయయాత్రను కొనసాగించింది.

యాక్షన్ మూవీగా ‘కృష్ణమ్మ’ మూవీ ఆడియెన్స్‌ను చక్కగా ఎంగేజ్ చేస్తూ థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లక్ష్మణ్ మీసాల, రఘుకుంచె, అతీరా రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో అలరించారు. వి.వి.గోపాలకృష్ణ సినిమాను డైరెక్ట్ చేశారు. కాలభైరవ సినిమాకు సంగీతాన్ని, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందించారు.