‘గేమ్‌ ఛేంజర్‌’ తరవాతే బుచ్చిబాబుతో సినిమా!

గ్లోబల్‌స్టార్‌ రామ్ చరణ్‌ హీరోగా, అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ మొదలై చాలా కాలం అయినా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఇటీవల తాజా షెడ్యూల్‌ మొదలు పెట్టారు. అక్టోబర్‌లో విడుదల చేయాలన్న తాపత్రయంతో శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్‌ ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘ఆర్‌సీ 16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం చేయబోతున్నారు. ఇటీవల గ్రాండ్‌గా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. రెగ్యులర్‌ షూటింగ్‌ ఇంకా మొదలు కాలేదు. దర్శకుడు బుచ్చిబాబు అయితే షూటింగ్‌ ఎప్పుడు మొదలుపెడదామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అయితే ‘గేమ్‌ చేంజర్‌’ షూటింగ్‌ పూర్తి కాకుండా రాంమ్ చరణ్‌ ఈ సినిమా షూటింగ్‌ పాల్గొనకూడదని ఫిక్స్‌ అయ్యారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘ఆర్‌సీ 16’ షూటింగ్‌ను జూనలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్‌ ఎంపికయ్యారు. ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని అక్టోబర్‌ 10 న విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.