సినీ పరిశ్రమలో పీఆర్ మాఫియా.. అనే మాట ఈ మధ్య బాగా వింటున్నాం. కొందరు ‘పీఆర్’ ముసుగులో ఈ మధ్య నెగెటివిటీ షురూ చేశారు. దానికి కొందరు సినీ జర్నలిస్టులు కారణమవుతున్నారు. పిచ్చాపాటీ చర్చల్లో ఆయా ప్రాజెక్టుల మీద చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు వార్తలై కూర్చుంటున్నాయ్.
తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద ఓ సీనియర్ సినీ జర్నలిస్ట్, ఓ పీఆర్ సంస్థ కలిసి నెగెటివ్ ప్రాపగాండా మొదలు పెట్టడం చర్చనీయాంశమవుతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా మీద విషం చిమ్మే ప్రక్రియ షురూ అయ్యింది.
ఈ వ్యవహారం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. చరణ్ నుంచి వస్తోన్న ప్రాజెక్టుల్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అనివార్య కారణాల వల్ల సినిమా ఆలస్యమయిన మాట వాస్తవం. ఆ ఆలస్యానికి చరణ్‌దే బాధ్యత.. అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. అవి కూడా పెయిడ్ పుకార్లు.
శంకర్ – రామ్ చరణ్ మధ్య టెర్మ్స్ బాగాలేవన్న ప్రచారం గతంలో జరిగితే, ‘గేమ్ ఛేంజర్’ టీమ్ దాన్ని ఖండించింది. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి అలాంటి ఖండన ప్రకటన ‘గేమ్ ఛేంజర్’ నుంచి రావాల్సి వుంటుందేమో.
రామ్ చరణ్ మీద స్ప్రెడ్ చేస్తోన్న ఈ నెగెటివిటీలోకి ఇతర హీరోల్ని సదరు పీఆర్ టీమ్ లాగుతోందన్నది మరో షాకింగ్ వ్యవహారం. గతంలోనూ పలు సినిమాలకి ఈ తరహా వంకర వేషాల్ని కొందరు ‘పీఆర్’ ముసుగులో వేసిన మాట వాస్తవం.