బెట్టింగ్ బంగార్రాజులకు ‘పసుపు’ వార్తల టెన్షన్!

ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం ఒక ఆసక్తికరమైన చర్చ ఒక వర్గం మీడియాలో వచ్చింది. ఇందులో భాగంగా భారీ ఎత్తున పోలింగ్ నమొదైంది కాబట్టి… ఇదంతా ప్రభుత్వంపై వ్యతిరేకత అని, జగన్ ను గద్దె దించి చంద్రబాబు సుపరిపాలన కోసం ప్రజలు పోలింగ్ బూత్ లకు పోటెత్తారు.. ప్రధానంగా వృద్ధులు, మహిళలు, ఎస్సీ, బీసీ, క్రీస్టియన్, ముస్లిం లు ముందుకు కదిలారని రాసుకొచ్చారు!

అందువల్లే ఈ స్థాయిలో పోలింగ్ నమోదైందని.. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటను.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడే ఈ స్థాయిలో పోలింగ్ నమోదవుతుందని.. రాబోయేది కూటమి ప్రభుత్వమే అని విశ్లేషణలు, కథనాలు వదిలారు! దీంతో పోలింగ్ ముగిసిన తర్వాత మొదటి మూడు రోజులూ టీడీపీ గెలుస్తుందంటూ బెట్టింగులు హోరెత్తిపోయాయి. ఒక దశలో 1:3 స్థాయికి కూడా చేరాయి. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా మొత్తం మారిపోయింది.

జగన్ విదేశీ పర్యటనకు ముందు ఐప్యాక్ టీం ని కలిసిన అనంతరం చేసిన వ్యాఖ్యల ఫలితమో.. లేక, మహానాడును ప్రీ రిలీజ్ ఈవెంట్ లా గ్రాండ్ గా చేయకుండా.. ఆ అదనపు ఖర్చు మాత్రం ఎందుకు అన్నట్లుగా అంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వాయిదా వేయడం వంటివి ఒక్కసారిగా మూడ్ ఆఫ్ ఏపీని మార్చేశాయని అంటున్నారు. పైగా మహిళలు, వృద్ధులు పోలింగ్ కి భారీగా పోటెత్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి!

దీంతో… వైసీపీ గెలుస్తుందంటూ ఒక్కసారిగా బెట్టింగ్ బంగార్రాజుల స్వరం మరిపోయింది. ఎవరికి వారు వైసీపీ మీదే బెట్టింగ్ చేయడంతో… తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసి దోచుకుందామనుకున్న బెట్టింగ్ నిర్వాహకులు తలలుపట్టుకున్నారని అంటున్నారు. ప్ర్ధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలువురు నేతలు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది! ఈ క్రమంలో టీడీపీ అనుకూల మీడియాగా పేరు సంపాదించుకున్న పత్రికలో ఒక కథనం అచ్చయ్యింది!

ఇందులో భాగంగా… టీడీపీ గెలుస్తుందని బెట్టింగులు జోరందుకున్నాయని.. వైసీపీ గెలుస్తుందని ఎవరు చెప్పినా, ఎన్ని విశ్లేషణలు తెరపైకి వచ్చినా బెట్టింగ్ రాయళ్లు మాత్రం.. కూటమే అధికారంలోకి వస్తుందని బెట్టింగులు కాసేస్తున్నారని రాసుకొచ్చారు! వైసీపీకి 70 స్థానాలు వస్తాయనే లెక్కపైనే బెట్టింగులు నడుస్తున్నాయని… కూటమికి మాత్రం 104 – 107 స్థానాలపైనే బెట్టింగ్ జోరందుకుందని రాసుకొచ్చారు!

దీంతో… ఇది ఒక “పసుపు” ట్రాప్ అని అంటున్నారు పరిశీలకులు! ఇలాంటి కథనాలు చూసి, ఫేక్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు నమ్మి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సర్వే ఫలితాలు నమ్మి బెట్టింగులు కాసి జీవితాలు పాడుచేసుకోవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల అభిప్రాయాలు ఈవీఎం మిషన్స్ లో నిక్షిప్తమై ఉన్నాయని.. జూన్ 1 న ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయని.. జున్న్ 4 ల ఎగ్జాట్ పోల్స్ రాబోతున్నాయని గుర్తుచేస్తున్నారు.

వైసీపీకి 150 సీట్లు అని, టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పే ఫేక్ న్యూస్ లు నమ్మి బెట్టింగుల వైపు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు. మరి బెట్టింగ్ బంగార్రాజులు ఈ మాటలు వింటారా.. లేక, పసుపు వార్తల మయలో పడి ఇబ్బందులు పడతారా అనేది వేచి చూడాలి!