మీ ఫోన్ హ్యక్ చేయబడిందని తెలిపే సంకేతాలు ఇవే..?

దేశంలో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ ఉపయోగించి ఎన్నో మంచి పనులు చేస్తుంటే సైబర్ నేరగాళ్లు మాత్రం ఈ టెక్నాలజీ అడ్డం పెట్టుకొని నేరాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కీ అనుగుణంగానే ఫైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త విధానాల ద్వార మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనే సమస్య ప్రస్తుత కాలంలో కలకలం రేపుతోంది. ఫోన్ హ్యాక్ చేసి ఇతరుల వ్యక్తిగత సమాచారం దొంగిలించి అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే మీ ఫోన్ హ్యాక్ చేయబడిందని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మీరు మాట్లాడే వ్యక్తి మాటలు కాకుండా అనవసరమైన శబ్దాలు వినిపిస్థాయి. అలా కాకుండా ఫోన్ సైలెంట్ లో ఉన్నా కూడా అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ ఫోన్ హ్యాక్ చేయబడిందని అర్థం . అలాగే ఫోన్ సెన్సార్‌ను ట్యాపింగ్‌కు గురైన ఫోన్‌ దగ్గర పెట్టినట్లయితే అలారం మోగుతుంది. ఒకే నిమిషంలో ఎక్కువ సార్లు అలారం మోగినట్లయితే ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని నిర్ధారించుకోవచ్చు. అలాగే మీ ఫోన్ ఎక్కువ సమయం ఉపయోగించకపోయినా కూడా ఫోన్ బ్యాటరీ తొందరగా అయిపోతుంటే మీ ఫోన్ హ్యాక్ చేయబడిందని అర్థం. అయితే పాత ఫోన్ లలో బ్యాటరీ డౌన్ అవ్వటం సాధారణం.

అదేవిధంగా కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం లేకుండానే ఫోన్‌ ఆన్‌ ఆఫ్ అవుతుంటే మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేసినట్లు గమనించాలి. ఇలా జరిగినప్పుడు మీ మొబైల్‌లో కొన్ని స్పై యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని . దొంగలించటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మీ కాల్స్‌ను కూడా ట్యాప్‌ చేస్తారు. అలాగే గేమింగ్‌ యాప్స్ వల్ల కూడా మీ ఫోన్ హ్యక్ చేయబడుతుంది. ఎందుకంటె వాటిని ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు కాల్‌ హిస్టరీ, అడ్రస్‌ బుక్‌, కాంటాక్ట్‌ లిస్ట్‌ కోసం పర్మిషన్‌ అడిగితే వాటిని వాడాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. కొన్ని కొన్ని సార్లు మనకు తెలిసిన పేర్లతో ఉన్న సైట్లు కూడా మనల్ని మోసం చేసి మీ ఫోన్ హ్యాక్ చేసే అవకాశం ఉంది.