అమెజాన్ లో భారీ ఆఫర్..రూ.19000 విలువ కూలర్ కోసం నెలకు రూ. 500 కడితే చాలు ..?

వేసవికాలం ఇంకా మొదలవకుండానే ఎండలు మండిపోతున్నాయి. ఏడాది ఉష్ణోగ్రత తీవ్రతలు చాలా ఎక్కువగా ఉండనున్నాయి. దీంతో ఈ ఉష్ణోగ్రతల వేడికి తట్టుకోలేక ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. వేసవికాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండటంవల్ల వీటి ధరలు కూడా అధికంగానే ఉంటున్నాయి. అయితే వేసవికాలం ఇంకా మొదలవకముందే కూలర్లు కొనుగోలు చేసేవారి కోసం అమెజాన్ లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్‌లో కూలర్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కూలర్ మోడల్‌ ప్రాతిపదికన తగ్గింపు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం అమెజాన్ లో కాసా కంపెన్‌హగెన్ ప్లుటో ఏ11.2 కలెక్షన్ కూలర్ పై భారీ డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా అమెజాన్ లో ఈ కూలర్ ప్రారంభ ధర రూ. 29,999గా ఉంది. అయితే అమెజాన్ లో దీన్ని ఇప్పుడు మీరు రూ. 10,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ కూలర్ పై ఏకంగా 63 శాతం తగ్గింపు వస్తోందని చెప్పుకోవచ్చు. 100 లీటర్లు. కెపాసిటీ ఉన్న ఈ కూలర్ లో ఐస్ చాంబర్ తో పాటు హనీకంబ్ ప్యాడ్స్ ఉన్నాయి. హ్యుమిడిటీ క్రంటోల్, హై డెన్సిటీ హనీకంబ్ ప్యాడ్స్, వైడర్ యాంగిల్ ఎయిర్ థ్రో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఫోర్ వే స్వింగ్ డిఫ్లెక్షన్, హెక్జాకూల్ టెక్నాలజీ, టర్బో టెక్నాలజీ, సూపర్ ఎయిర్ డెలివరీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

అలాగే ఇందులో వాటర్ లెవెట్ ఇండికేటర్, కాస్టోర్ వీల్స్ ఉంటాయి. వీటి వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకు ఈజీగా తీసుకెళ్లొచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ రూపంలో ఈ కూలర్ కొంటే తక్కువ ఈఎంఐ ఆఫర్ ద్వారా దీనిని కోనుగోలు చేయవచ్చు. నెలకు రూ. 539 చెల్లిస్తే చాలు. ఈ రూ. 539 ఈఎంఐ అనేది 24 నెలల టెన్యూర్‌కు వర్తిస్తుంది . ఒకవేళ 18 నెలల ఈఎంఐ పెట్టుకుంటే అప్పుడు నెలకు రూ. 686 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాది పాటు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 993 చెల్లించాల్సి వస్తుంది. అలాగే 9 నెలల ఈఎంఐ అయితే నెరలకు రూ. 1295 కట్టాలి.