ఆస్ట్రేలియా గడ్డపై ఫేవరేట్ టీంగా బరిలోకి దిగిన టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయింది.అతి కష్టం మీద టీ 20 సిరీస్ 2-1తో గెలిచింది. ఇక నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ డే అండ్ నైట్ ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేనే తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాని 191 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ 36 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో అడిలైడ్ టెస్ట్‌లో ఘోరంగా పరాజయం పాలైంది. ఈ స్కోరు టెస్ట్ చరిత్రలో అత్యల్ప స్కోరుగా నమోదైంది. 1974లో ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ జట్టు 42 పరుగులకి ఆలౌటవగా.. తాజాగా ఆ రికార్డ్ కూడా కనుమరుగైంది.
ఇప్పటి వరకు టెస్ట్ చరిత్రలో అత్యల్ప స్కోరు చేసిన టీంగా ఆస్ట్రేలియానే ఉంది. 1955లో ఇంగ్లండ్‌త జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులకి ఆలౌటైంది ఆసీస్. ఇక 1896లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 30 రన్స్ చేయగా, 1924లో మరోసారి ఇంగ్లండ్ చేతిలోనే సౌతాఫ్రికా కేవలం 30 రన్స్ చేసింది. 1899లో ఓ సారి ఇంగ్లండ్ చేతిలో సౌతాఫ్రికా 35 రన్స్ చేసింది.1932లో ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిన సౌతాఫ్రికా ఓ ఇన్నింగ్స్‌లో కేవలం 36 రన్స్ మాత్రమే చేసింది. 1902లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ కేవలం 36 పరుగులకే చతికిలబడింది.
ఈ రోజు ఆసీస్- భారత్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ చేసిన 36 పరుగుల అత్యల్ప స్కోరు ఏడవ స్థానంలో ఉంది. 2019లో ఐర్లాండ్ ఓ ఇన్నింగ్స్‌లో 38 పరుగులకే ఆలైట్ అయింది. 1946లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ 42 పరుగులు మాత్రమే చేసింది. 1888లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓ ఇన్నింగ్స్‌లో 42కే నిష్క్రమించింది. అయితే టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో వంద కన్నా తక్కువ స్కోర్‌కే భారత్ అయిదు సార్లు ఆలౌట్ అయ్యింది. 1947లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా చేతిలో 58 పరుగులిక ఆలౌట్ కాగా, 1952లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 రన్స్ చేసింది. 1996లో డర్బన్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అత్యల్పంగా 66 రన్స్ చేసి ఆలౌటైంది.