భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మేన్స్ టీ20 వరల్డ్ కప్–2026 షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఐసీసీ ప్రకటించిన ఈ షెడ్యూల్ ప్రకారం ఈసారి టోర్నమెంట్ భారతదేశం–శ్రీలంకల్లో కలిపి జరగనుండగా.. మ్యాచ్‌ల వాతావరణం రెండు దేశాల్లో పండగ నెలకొననుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నెలరోజు పాటు సాగనున్న ఈ మెగా టోర్నీలో మరోసారి 20 జట్లు తలపడుతున్నాయి. మొదటిసారి ఇటలీ అర్హత సాధించడం ఈ టోర్నీకి అదనపు ఆకర్షణగా మారింది.
టోర్నీ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబోలో పాకిస్థాన్–నెదర్లాండ్స్ మధ్య ప్రారంభమవుతుంది. అదే రోజు ముంబై వేదికగా భారత్–యూఎస్ఏ జట్లు ఢీకొననున్నాయి. అయితే అయితే అసలైన హీట్ ఫిబ్రవరి 15న మొదలుకానుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్–పాకిస్థాన్ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికే ఎగ్జైట్మెంట్‌లో మునిగిపోయారు.
భారత్ మ్యాచ్‌లు వివరాలు:
ఫిబ్రవరి 7 – భారత్ vs USA (ముంబై)
ఫిబ్రవరి 12 – భారత్ vs నమీబియా (ఢిల్లీ)
ఫిబ్రవరి 15 – భారత్ vs పాకిస్థాన్ (కొలంబో)
ఫిబ్రవరి 18 – భారత్ vs నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)
ఫైనల్ మాత్రం భారీ వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 8న జరగనుంది. కొత్త రికార్డులు పుట్టించే ఫైనల్ అవుతుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. భారత్, పాకిస్థాన్, యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌తో కూడిన గ్రూప్ A ఇప్పటికే “గ్రూప్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్”గా గుర్తింపు పొందుతోంది. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్–8కు అర్హత సాధిస్తాయి. సూపర్–8 నుంచి సెమీస్, అక్కడినుంచి ఫైనల్.. థ్రిల్లింగ్ క్రికెట్‌కు రంగం సిద్ధమైంది.
ఈ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా 2024 వరల్డ్ కప్ విజేత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను టోర్నీ బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ నియమించింది. షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా పాల్గొనడం కార్యక్రమానికి మరింత వైభవం తెచ్చింది. శ్రీలంకలో క్యాండీ, కొలంబో వేదికలు… భారతదేశంలో ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా వేదికలు ప్రపంచకప్ క్రీడలతో కిక్కిరిసిపోబోతున్నాయి. హై–స్కోరింగ్ పిచ్‌లు, స్పిన్ ఫ్రెండ్లీ గ్రౌండ్లు, ఆసియన్ కండిషన్స్.. అన్నీ టీ20 క్రికెట్‌కు మరింత రసవత్తరత ఇచ్చేలా ఉన్నాయి. ఈసారి కొత్త జట్లు, కొత్త వేదికలు, కొత్త ఎనర్జీతో 2026 టీ20 వరల్డ్ కప్ అభిమానుల కోసం ఒక గ్రాండ్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌గా మారడం ఖాయం అంటున్నారు.
