సామాజిక తెలంగాణ కావాలంటే ఒక్క రూపాయి ఇవ్వండి (వీడియో)

అతను రోడ్డుపై చెత్త ఏరుకుంటూ కనపడిన వారందరిని తలా ఒక రూపాయి అడుక్కుంటున్నాడు. గడ్డం పెంచుకొని మాసిన దుస్తులు ధరించి చూడటానికి పిచ్చివాడిలా కనిపిస్తున్నాడు. కానీ ఆయనని కదిలిస్తే అతనో కళాకారుడని తేలింది. తెలంగాణకు ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాన్ని తన పాట రూపంలో చాలా చక్కగా వివరించాడా నిర్మల్ జిల్లా కళాకారుడు.

సామాజిక తెలంగాణ కావాలంటే ఒక్క రూపాయి దానం ఇవ్వాలని కోరాడు. ఉద్యమాలకు రాత్రి లేదు పగలు లేదని ఏదైనా ప్రేమతోనే సాధించాలన్నాడు. రచ్చబండ పెట్టిన రాజశేఖరుడు పావురాల గుట్ట పాలయే అంటూ దోపిడిపై ప్రశ్నించాడు. బంగారు తెలంగాణ ఏదని లక్ష ఉద్యోగాలు ఎటుపోయాయని నిలదీశాడు. తెలంగాణలో కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ఉన్నోడే బాగుపడ్డాడు కానీ పేదవానికి ఏం న్యాయం జరిగిందో జరచెప్పరాదుర్రి అంటూ ప్రశ్నించాడు. అభివృద్ది చెందామంటూ ఐటి మంత్రి రామారావు గొప్పలు చెబుతున్నాడని ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది ఇదేనా బంగారు తెలంగాణ జరచెప్పరాదుర్రి అంటూ తన పాట రూపంలో పాడి అందరిని ఆకట్టకున్నాడు. ఆ  కళాకారుడు పాడిన పాట వీడియో కింద ఉంది మీరు కూడా చూడండి.