హీరో నవదీప్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

నవదీప్ తెలుగు సినిమా నటుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించాడు. నవదీప్ కు చిన్నప్పటినుండి సినిమాలలో నటించాలని కోరిక మాత్రం ఉండేది కాదు. తాను చదువుకునే రోజుల్లో సినిమాలు మాత్రం ఎక్కువగా చూసేవాడు.

తన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. కొత్త వాళ్లకు కూడా అవకాశం ఉందంటే వెళ్లి సెలెక్ట్ కావడం తర్వాత జై సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం జరిగింది. ఈ జై సినిమాను తమిళంలో రీమేక్ చేస్తే అక్కడ కూడా ఈ సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చాడు. ఇక గౌతమ్ ఎస్. ఎస్. సి సినిమా ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ చిత్రం తర్వాత ఈయన కెరీర్లో ది బెస్ట్ చిత్రం చందమామ.

ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించక సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ వరుసగా సినిమాలు పరాజయం కావడంపై ఒక సందర్భంలో నవదీప్ తనకు ఇలాంటివి ఎదురుకోవడం పెద్ద కష్టమేమి కాదు అని పేర్కొనడం కూడా జరిగింది.

ఈయన సినిమాలోనే కాక బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ వన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్ బాస్ లో సందడి చేశాడు. ఇక నవదీప్ టాలీవుడ్ స్క్వేర్స్, అదిరింది వంటి షోలలో కూడా హోస్ట్ గా చేసి అలరించడం జరిగింది. నవదీప్ కు దేశాటన అంతే ఎంతో ఇష్టం. ఇందుకు సంబంధించిన వీడియోలు, ట్రావెలింగ్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటాడు.

తన సినిమా ప్రయాణంలో భాగంగా బైక్ పై చేసే విన్యాసాలు అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. నవదీప్ గతంలో తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో జరిగిన చర్చలపై స్పందిస్తూ ఈ ప్రపంచంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే అది కేవలం పెళ్లి చేసుకొని వారే. పెళ్లి చేసుకుంటే నిత్యం బాధలే, పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ తిన్నా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడికి వెళ్లినా అడిగే వారే ఉండరు అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం నవదీప్ తమిళంలో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం.