వాట్సప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై 100 వీడియోలు షేర్ చేసే ఛాన్స్…?

దేశవ్యాప్తంగా నెంబర్ వన్ మెసేజింగ్ యాప్ గా గుర్తింపు పొందిన వాట్సప్ ఎప్పటికప్పుడు తమ యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే వాట్సప్ ద్వారా చాటింగ్, వీడియో కాలింగ్, స్టేటస్ షేరింగ్, ఫొటోస్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ అందిస్తున్న ఈ ఫీచర్స్ యూజర్స్ కి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ యాప్‌ అత్యధికంగా యూజర్‌లను సొంతం చేసుకుని మార్కెట్‌ను విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇటీవల వరుసగా అప్‌డేట్‌లను రిలీజ్‌ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా యూజర్స్ కి మరో గుడ్‌న్యూస్‌ అందించింది.

గతంలో వాట్సాప్ ద్వారా ఎక్కువ మీడియా ఫైల్స్ ని షేర్ చేసే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాట్సప్ ద్వారా ఒకేసారి ఎక్కువ మీడియా ఫైల్స్‌ను షేర్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ బీటాలో చాట్‌లలో గరిష్టంగా 100 మీడియాలను షేర్ చేసేలా సరి కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్‌ వినియోగదారులు యాప్‌లోని మీడియా పికర్ ద్వారా గరిష్టంగా 100 మీడియాలను షేర్ చేసే అవకాశం కలుగుతుంది. గతంలో మీడియా పికర్ ఫీచర్‌కు 30 మీడియాలను యాడ్‌ చేసే ఆప్షన్‌ ఉండేది.కానీ ఇప్పుడు ఒకేసారి 100 వీడియోలు షేర్ చేయవచ్చు.

ఈ సరికొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌ల కోసం గూగుల్‌ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంది. అప్‌డేట్ 2.23.4.3 వెర్షన్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న వాట్సప్ యూజర్స్ చాట్‌లో ఒకేసారి 100 మీడియాను షేర్‌ చేసే ఆప్షన్‌ ఉంటుంది. అయితే ఇది iOS బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంటుందా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. అంతేకాకుండా పెద్ద మీడియా ఫైల్‌లను ఒకేసారి పంపుతున్నప్పుడు యూజర్స్ ఒకే ఫోటో లేదా వీడియోని రెండుసార్లు షేర్ చేయకుండా ఈ ఫీచర్ సహాయపడుతుంది. ఈ సరికొత్త వీడియో షేరింగ్ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుంది.