బీహార్ ఎన్నికల ఫలితాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేయడం ఏమిటి, ఆయనకు బీహార్ ఎన్నికలకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా.. సంబంధం ఉంది. అయితే నేరుగా కాదు. పరోక్షంగా. బీహార్ ఎన్నికలు అక్టోబర్ 28 నుండి నవంబర్ 7వరకు మూడు దశల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రజెంట్ పాలన సాగిస్తున్న జెడీయూ, ఎన్డీయే కూటమికి చాలా ముఖ్యం. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే రాష్ట్రం కాబట్టి ఇక్కడ మరోసారి పాగా వేయాలని నరేంద్ర మోదీ గట్టిగా సంకల్పించుకున్నారు. బీహార్ ప్రభుత్వంలోకి బీజేపీ రావడమే అనూహ్య పరిణామం. 2015లో జెడీయూ, ఆర్జేడీలు కూటమిగా ఏర్పడి విజయం సాధించాయి. అప్పట్లో ఒప్పందం మేరకు తమకంటే తక్కువ సీట్లే వచ్చిన జెడీయూకు ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలింది ఆర్జేడీ.
కానీ 2017లో ఆయన పార్టీ పిరాయించి బీజేపీతో చేతులు కలపడంతో ఆర్జేడీ, జేడీయూల ప్రభుత్వం పోయి జెడీయూ, ఎన్డీయే సర్కార్ ఏర్పడింది. ఇప్పుడు పరిస్థితులు గతం కంటే భిన్నంగా ఉన్నాయి. వరుసగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలోకి రావలేకపోయింది. అందుకే బీహార్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈసారి కూడ కూటమి అభ్యర్థిగా నితీష్ కుమార్ ఖాయమయ్యారు. కానీ వీరి పట్ల ప్రజల్లో వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉందని అందరూ అంటున్నారు.
సుధీర్ఘమైన నితీష్ కుమార్ పరిపాలన, కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొన్ని వైఫల్యాలు కలిసి కాంగ్రెస్, ఆర్జేడీల కూటిమికి కలిసివచ్చే అవకాశం ఉంది. అందుకే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో జనం మధ్యకు వెళ్లాలని ఎన్డీయే భావిస్తోంది. సంక్షేమ పథకాలు అనగానే ఈమధ్య దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైఎస్ జగన్. ఆయన ప్రవేశపెట్టిన సచివాలయ వ్యభస్థ, ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడి, 108 అంబులెన్స్ సేవలు, రైతు భరోసా కేంద్రాలు లాంటి పథకాలు బాగా క్లిక్ అయ్యాయి. జాతీయ స్థాయిలో పేరొచ్చింది. అందుకే వీటిని రానున్న ఎన్నికల్లో తమ హామీలుగా ఇవ్వాలని ఎన్డీయే, జేడీయూ కూటమి భావిస్తోందట. బీహార్ రాష్ట్రంలో 38 జిల్లాల్లో గ్రామీణ ఓటర్లు చాలా ఎక్కువ. వారిని జగన్ రూపొందించిన ఈ పథకాలు ఆకట్టుకుంటాయని, ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు దొరుకుతుందని, ఏపీలో జరిగినట్టే బీహార్లో కూడ గెలుపు ఏకపక్షమై తామే గెలుస్తామని నితీష్ కుమార్, మోదీ ఆశలు పెట్టుకున్నారట. మరి జగన్ సంక్షేమ పథకాల ఆలోచనలు బీహార్ ఎన్నికలను ఏమాత్రం డిసైడ్ చేస్తాయో చూడాలి.