Sanjana Galrani: అర్ధరాత్రి సమయంలో నటి సంజనకు అశ్లీల సందేశాలు..?

Sanjana Galrani: టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ గా నటించిన సంజనా గల్రాని గురించి మనందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ తరువాత సినిమాల్లో నటించి బాలీవుడ్ కి చెక్కేసింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకుంది. ఇక ఈమె ఒకవైపు కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతోపాటు తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో కలిసి చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా నటి సంజనా కి అశ్లీల సందేశాలు పంపిన ఒక ఫ్యాషన్ డిజైనర్ కుమారుడిని తాజాగా నగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫిబ్రవరి 25 తేదీన అర్ధరాత్రి సమయంలో నటి సంజన కుఅశ్లీల సందేశాలు పంపాడు. దీంతో వెంటనే ఆమె వాట్సాప్ చాట్ సందేశాలను పోలీసులకు అందజేయడంతో, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. అయితే ఆ విచారణలో ఆ వ్యక్తి సంజనకు ఇలాంటి సందేశాలను పంపలేదని పోలీసులకు వివరించినట్లు సమాచారం.