ఆధునిక జీవనశైలి వల్ల యువతలో గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా యువతలో గుండెపోటు ప్రాబల్యం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు వంటివి తినడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటివి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
బరువైన వస్తువులను తరలించడం, కఠినమైన వ్యాయామం వంటివి చేస్తున్నప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చు. ఊబకాయాన్ని తగ్గించడం ద్వారా గుండెపోటు మరణాలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి.
కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా గుండెపోటు దూరమవుతుంది. బరువైన వస్తువులను తరలించడానికి, కఠినమైన వ్యాయామం చేయడానికి ముందు గుండె మరియు ఆరోగ్య కారకాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక అమ్మాయి లేదా అబ్బాయి స్కూల్ గ్రౌండ్ స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటూనే గుండెపోటు వచ్చి హఠాత్తుగా కుప్ప కూలిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కొన్ని సార్లు చురుగ్గా, క్రమశిక్షణతో ఉండే అథ్లెట్లు హార్ట్ అటాక్ కు గురి కావడం చాలా మందిని టెన్షన్ పెడుతోంది. మారుతున్న జీవన శైలి వల్లే ఈ విధంగా జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బరువు తగ్గడం, మద్యం, ధూమపానంకు దూరంగా ఉండటం ద్వారా గుండె సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.