Aadi pinishetty: సినిమా ఇండస్ట్రీలో కొనసాగి సెలబ్రిటీలు చాలా క్లోజ్ గా ఏ ఇద్దరు కనిపించిన వెంటనే వారికి పెళ్లి చేసేయడం లేదా భార్యాభర్తలు కొద్దిరోజుల పాటు కనిపించకపోయిన వారికి విడాకులు ఇవ్వడం అనేది సర్వసాధారణంగా సోషల్ మీడియాలో జరిగే విషయమని చెప్పాలి. ఇలా ఎంతోమంది సెలబ్రిటీల గురించి ఇలాంటి రూమర్స్ ఎన్నో వినపడుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఇలాంటి వాటిని సెలబ్రిటీలు ఖండిస్తూ వస్తుంటారు.
ఈ క్రమంలోనే దర్శకుడు రవి రాజా పినిశెట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఆది పినిశెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు ఇక తెలుగులో కూడా ఆది పినిశెట్టికి ఎంతో మంచి క్రేజ్ ఉంది ఈయన తెలుగులో హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు తన భార్య నిక్కి గల్రానీకి విడాకులు ఇవ్వడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలు వీరిద్దరు విడిపోతున్నారు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన ఈయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మనం సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తుంటాం కానీ చాలా సెన్సిటివ్గా మాత్రం ఉండకూడదని తెలిపారు. ఇక నా భార్యకు నేను విడాకులు ఇవ్వబోతున్నానంటూ ఒక పోస్ట్ చూసాను వెంటనే ఆ పోస్ట్ చూసే షాక్ అవ్వడమే కాకుండా ఆ వ్యక్తి ఎవరు అనే విషయం గురించి ఆరా తీస్తూ ఆయన ఎలాంటి పోస్టులు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకున్నానని తెలిపారు.
ఇలా నేను నా భార్య విడాకులు తీసుకుంటున్నామని వార్త చూసినప్పుడు మొదట్లో కాస్త బాధపడ్డాను కానీ వెంటనే ఆ ఘటన నుంచి బయటకు వచ్చేసాను. ఇలాంటి వాళ్లు గురించి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లు వాళ్ళ లైఫ్ ని అలా బతికేస్తున్నారు అని అనుకోవడమే. అయితే ఇవి కాకుండా క్రిటిక్స్, నెగిటివ్ క్రిటిక్స్, పాజిటివ్ క్రిటిక్స్ అవి నేను తీసుకుంటాను అంటూ ఈయన విడాకుల గురించి క్లారిటీ ఇచ్చారు.