Young Actor’s 2nd Marriage : కొన్నాళ్ళ క్రితం విడాకులు తీసుకున్న టాలీవుడ్ నటుడొకరు మళ్ళీ పెళ్ళి పీటలెక్కబోతున్నాడట. ఎవరా నటుడు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవర్ని పెళ్ళి చేసుకోబోతున్నాడట.? అంటే, ఓ నటిని పెళ్ళాడబోతున్నాడట. ఆ నటి కూడా నార్త్ నుంచి వచ్చి తెలుగు సినిమాలు చేస్తోందని అంటున్నారు.
సదరు నటుడికి అతని మొదటి భార్యతో విడాకులకు కారణం కూడా ఈ నటి.. అంటూ ప్రచారం అప్పట్లోనే జరిగింది. అదంతా దుష్ప్రచారమేనంటూ సదరు నటుడి తరఫున ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అప్పట్లో క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
అయినా, ఈ రోజుల్లో ప్రేమ, బ్రేకప్, పెళ్ళి, విడాకులు, మళ్ళీ పెళ్ళి.. ఇవన్నీ సర్వసాధారణమే కదా. రెండో పెళ్ళి ఏం ఖర్మ.. వీలైతే, మూడో పెళ్ళి, నాలుగు.. కుదిరితే ఐదో పెళ్ళిదాకా వెళ్ళినా తప్పు పట్టడానికేమీ లేదు. కేవలం సినీ రంగంలోనే ఇలా జరుగుతోందని అనడం సబబు కాదు. బయట కూడా ఇలాంటి విచిత్రాలు చాలానే వున్నాయ్.
సినిమా జనాలు కదా, ఒకింత గాలి వార్తలు ఎక్కువగా భరించాల్సి వుంటుందంతే. ఇంతకీ, ఈ గాసిప్‌లో నిజమెంత.? ఆ నటుడైతే పెదవి విప్పడు. పెళ్ళంటూ జరిగితే అది రహస్యంగా వుండదు కదా.. భయపడాల్సిన పనేముంది. విషయం నిజమైతే, ఆ కబురు అధికారికంగానే బయటపడుతుంది.