Naga chaitanya: విడాకుల తర్వాత ఆ విషయంలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్న నాగ చైతన్య!

Naga chaitanya: టాలీవుడ్ ప్రేక్షకులకు అక్కినేని నాగచైతన్య గురించి పరిచయం అవసరం లేదు. జోష్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి దగ్గరైన ఈ హీరో.. ఆ తర్వాత వచ్చిన ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక అలా పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోలలో తాను ఒక్కడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక సమంతతో ప్రేమ వివాహం గురించి మనకు తెలుసు. సినీ ఇండస్ట్రీలోనే నెక్స్ట్ లెవెల్ కపుల్స్ గా ఇండస్ట్రీలో హడావిడి చేస్తూ ఎంతో అన్యోన్యంగా తిరిగిన ఈ జంట ఈమధ్యే వీరి దాంపత్య జీవితానికి బ్రేక్ ఇచ్చారు.

ఇక ఈ విషయాన్ని నార్మల్ పీపుల్ నుంచి సెలబ్రిటీలు సైతం ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు.వీరిద్దరి అభిమానులు మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే విడాకులు అనంతరం సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా యాక్టీవ్ గా ఉండే నాగ చైతన్య. ఇన్ స్టాగ్రామ్ లో మరో పోస్ట్ తో నెటిజన్లను ఆకట్టు కుంటున్నాడు. తాజాగా బీచ్ లో తీసిన సన్ సెట్ స్నాప్ ను తన ఇన్ స్టా ఖాతాలో పంచుకున్నాడు.

అంతేకాకుండా ఈ ఫోటోకి బ్రీత్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక ఈ పోస్ట్ ను గమనించిన నెటిజన్లు చైతన్య విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఒక లక్ష ఎనభై ఐదు వేలకు పైగా ఇష్టాలను పొందింది.