Naga chaithanya: అక్కినేని హీరో క్రేజ్ మామూలుగా లేదుగా…. విడాకుల తర్వాత చేతిలో 5 ప్రాజెక్టులు!

Naga chaithanya: నాగ చైతన్య ఏ మాయ చేసావే సినిమాతో గుర్తింపు తెచ్చుకుని మంచి సక్సెస్ ను అందుకున్నాడు. సమంతను పెళ్లి చేసుకుని హాట్ టాపిక్ గా మారి విడాకులతోను అంతే పాపులర్ అయ్యారు చై, సామ్. విడాకుల తర్వాత డీలా పడిపోకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు నాగ చైతన్య . నాగచైతన్య అక్కినేని వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా స్టాండ్ అయ్యాడు.ఇటీవల తన తండ్రితో కలిసి నటించిన బంగార్రాజు సంక్రాంతి రిలీజ్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వసూలు బాగానే చేసింది.

నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. థాంక్యూ అంటూ వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ నాగచైతన్య ఇద్దరు కలిసి అమెజాన్ లో థ్రిల్లర్ నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ ను కూడా ప్లాన్ చేశారట. థాంక్యూ సినిమా తర్వాత పరశురాం డైరెక్షన్ లో ఒక సినిమా నందిని రెడ్డి డైరెక్షన్లో మరొక సినిమా ప్లాన్ చేస్తున్నాడట. వీటితో పాటు నాంది సినిమా ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట.

వీటితో పాటు ఒక తమిళ రీమేక్ కూడా క్యూ లో ఉంది.తమిల సూపర్ హిట్ మూవీ మానాడు తెలుగు రీమేక్ లో కూడా నాగ చైతన్య నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. మొత్తానికి విడాకుల తర్వాత వరుస సినిమాలతో నాగ చైతన్య ఎంతో బిజీ బిజీగా కనిపిస్తున్నారు.