సీరియస్ గా టీవీ9 నుంచి కాల్ కోసం చూస్తున్నా అంటున్న ప్రముఖ నటుడు.!

Young Actor :  తాజాగా తెలుగు సినిమా దగ్గర ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ అయినటువంటి టీవీ9 తో సంబంధించి ఎలాంటి వివాదం నడుస్తుందో ఆ సంగతి తెలుగు ప్రజానీకం చూస్తూనే ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ని తమ స్టూడియోకి పిలిచి చేసిన రాద్ధాంతం విషయంలో గత రెండు రోజులు నుంచి సినీ వర్గాల్లో పెద్ద ఎత్తునే దుమారం లేస్తుంది.

అయితే ఈ సమయంలో విశ్వక్ సేన్ సినిమాకి మంచి ప్రమోషన్స్ జరిగిపోయినా ఆ ఛానెల్ ఇప్పుడు రుద్దుతున్న వార్తలపై మాత్రం మిగతా కొంతమంది సినీ ప్రముఖులు అలాగే సామాన్య ప్రజలు అయితే విసుగెత్తిపోయారు. దీనితో సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా తెలుగు సినిమాకి చెందిన యంగ్ అండ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రాహుల్ రామకృష్ణ అయితే తన సోషల్ మీడియాలో డైరెక్ట్ గానే అనేక కామెంట్స్ చేస్తున్నాడు. టీవీ9 ఛానెల్ సమాజానికి మంచిది కాదు అని న్యూస్ తప్ప అన్ని ప్రసారం చేస్తారని కామెంట్స్ చెయ్యగా..

తాజాగా అయితే తాను సీరియస్ గా ఆ స్టూడియో నుంచి డిబేట్ కి పిలుస్తారేమో అనే కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఓపెన్ ఛాలెంజ్ అన్నట్టు కన్ఫర్మ్ చేసాడు. దీనితో తాను ఎంత క్లారిటీ గా ఉన్నాడో అర్ధం అవుతుంది. మరి నిజంగానే వారు రాహుల్ ని పిలిచే ధైర్యం చేస్తారో దానికి అతడే ఒక ముగింపు ఇస్తాడేమో చూడాలి.

https://twitter.com/eyrahul/status/1521955504670781440?s=20&t=HVM_9x6tbcF_gvkzi1-7dg