Varun Sandesh: మామూలుగా హీరోస్ అంటే తమ ఏజ్ లేదా వారు నటించిన వాళ్లతో కలిసి ఇండస్ట్రీలో ఒక బ్యాచ్‌లాగా ఏర్పడడం సహజమే. కానీ అలాంటి బ్యాచ్‌లేమీ తనకు లేవని కరాఖండీగా చెప్పేశారు ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్. ఇప్పటివరకు తన బ్యాచ్‌లో ఉన్నది అంటే తన భార్య వితిక, పేరెంట్స్, ఫ్రెండ్స్ అని ఆయన సమాధానమిచ్చారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన హ్యాపీడేస్ సినిమాకు సంబంధించి వరుణ్ సందేశ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ సినిమాలో తనతో పాటు నటించిన రాహుల్, తమన్నా లాంటి వారు ప్రస్తుతం చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కో దారిలో ఉన్నారని ఆయన అన్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో మేము అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండే వాళ్ళమని ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమా గురించి తెలియజేశారు.
ఒకప్పుడు తనతో చేసిన హీరోలు, హీరోయిన్స్ ప్రస్తుతం చాలా మంది సక్సెస్ అయ్యి మంచి పొజిషన్‌లో ఉన్నారని వరుణ్ సందేశ్ అన్నారు. ఒక సినిమాకు సంబంధించి షూటింగ్‌లో ఉన్నపుడు ఆ టైంలో అందరం ఫ్యామిలీలాగే ఉంటామని ఆయన తెలిపారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ వారి వ్యక్తిగత జీవితం ఉంటుందని, ఫ్రెండ్స్‌తో గడపడం అన్నీ ఉంటాయని ఆయన చెప్పారు. ఇప్పటికీ తాను ఒకప్పుడు నటించిన వాళ్లతో ఫోన్‌చేసి మాట్లాడుతూ ఉంటానని ఆయన స్పష్టం చేశారు.