మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న ఉపాసన… ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉపాసన అతి చిన్న వయసులోనే అపోలో లైఫ్‌కి వైస్ చైర్‌ పర్సన్‌గా, బీ పాజిటివ్‌ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా భాద్యతలు నిర్వర్తిస్తోన్న ఆమె సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. జంతువుల మీద ఉన్న ప్రేమతో ఎన్నో వందల జంతువులను సంరక్షిస్తోన్న ఉపాసన పర్యావరణానికి సంబంధించి ఎన్నో ఛారీటీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉపాసనకి ఇటీవల మరొక అరుదైన గౌరవం దక్కింది.

ఉపాసన చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన అమెరికా తెలుగు అసోసియేషన్స్ వాళ్లు ఉపాసనని జ్ఞాపికతో పాటు శాలువాతో సత్కరించారు. అమెరికాలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఉపాసనతో పాటు తెలంగాణ సీఎం కూతురు కవిత, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాసన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆమెను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత ఉపాసన అందరి ముందు సద్గురుని పిల్లల గురించి తనకి ఉన్న అనుమానాన్ని అడిగింది.

అయితే ఉపాసన, రామ్ చరణ్ వివాహం జరిగి ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తి అయ్యింది. దీంతో వీరికి ఇంకా పిల్లలు పుట్టకపోవటం తో ఉపాసన ఎక్కడికి వెళ్ళినా పిల్లల గురించి అడుగుతున్నారు. అందువల్ల ఉపాసన ఈ కార్యక్రమాల్లో సద్గురుని పిల్లల గురించి అడుగుతూ నా వైవాహిక జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. పిల్లల్ని కనటం అనేది నా వ్యక్తిగత విషయం. కానీ అందరూ ఈ విషయం గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు? అని అడిగింది. దానికి సమాధానంగా సద్గురు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని కనని వారికి నేను ఒక అవార్డు ఇస్తాను అని సమాధానం చెప్పాడు. దీంతో సద్గురు చెప్పిన సమధానం కి నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.