ఆస్కార్ కంటే విలువైన అవార్డు దక్కిందంటూ ఎమోషనల్ అయిన అడివి శేష్..!

క్షణం సినిమా ద్వార హీరోగా తన టాలెంట్ నిరూపించుకున్న అడవి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమా ద్వార ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమ మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని థియేటర్లలో దూసుకుపోతోంది. ముంబైలో జరిగిన టెర్రర్ దాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన ఒడిదుడుకులు, దేశం కోసం ఆయన చేసిన సేవ మొదలగు విషయాల గురించి ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు.

ప్రకాష్ రాజ్, రేవతి మురళి శర్మ వంటి ప్రముఖులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా సాయీ మంజ్రేఖర్‌, శోభితా దూళిపాళ్ల కథానాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ వారు కలిసి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అభిమానుల కోసం ఈ సినిమా ప్రీమియర్ షో ని 24 నుంచి 29 వరకు ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ చూసిన ప్రేక్షకులకు సినిమా సూపర్ హిట్ అంటూ చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా ఇటీవల ముంబైలోని 312 మంది నేషనల్ సెక్యూరిటీ గార్ట్స్ , వారి కుటుంబ సభ్యుల కోసం కూడా స్పెషల్ షోను ప్రదర్శించారు. వారి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల అడివి శేష్ మాట్లాడుతూ సినిమా చూసిన కమండోలు ఎలా స్పందించారో చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ ..” సినిమ చూసిన తర్వాత 312 కమాండో వారు చాలా నిశబ్దంగా ఉండిపోయారు. తర్వత నన్ను తమ హెడ్‌క్వార్టర్స్‌కి పిలిపించారు. నేను అక్కడికి వెళ్లిన తర్వాత బ్లాక్ క్యాట్ కమాండోస్ తరపున మెడల్ తో నన్ను సత్కరించారు. ఆ మెడల్ నాకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఆ మెడల్ ఆస్కార్‌ అవార్డు కంటే విలువనైది ” అంటూ చెప్పుకొచ్చాడు..