Avasarala Srinuvas:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా డైరెక్టర్ గా రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించడమే కాకుండా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇలా కెరీర్ పరంగా ఎంతో అద్భుతంగా దూసుకుపోతున్న నటుడు అవసరాల శ్రీనివాస్ తన పెళ్లి గురించి షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.ఒకానొక సమయంలో తన పెళ్లి గురించి ప్రస్తావన రాగా ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవు అంటూ తన పెళ్లి విషయాన్ని దాటవేశారు.
అయితే తాజాగా ఈయన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా తర్వాత అవసరాల శ్రీనివాస్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున ప్రస్తావన వస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి తన పెళ్లి గురించి ప్రస్తావించిన అవసరాల శ్రీనివాస్ తను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఇలా పెళ్లి గురించి తన నిర్ణయం విన్న అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
పెళ్లి గురించి తన నిర్ణయాన్ని ఇంట్లో చెప్పగా తన నాన్న ఎంతో జలగా ఫీల్ అయ్యారని అవసరాల శ్రీనివాస్ వెల్లడించారు.అయితే ఒకానొక సందర్భంలో పెళ్లి ఎందుకు చేసుకున్నామా అనే ఫీలింగ్ రాకమానదు అందుకే ఇప్పుడే పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలియజేశారు. పెళ్లి గురించి అవసరాల తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తన కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఉన్నారని ఓ సందర్భంలో ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు.