Suicide Plant : సూసైడ్ ప్లాంట్: మొక్కే కదా పీకేద్దామనుకుంటున్నారా.? అయితే సచ్చారే.!

Suicide Plant

Suicide Plant : మొక్కే కదా అని పీకేస్త పీక కోస్తా.. అని ఓ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ వెరీ ఫేమస్. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే మొక్కను టచ్ చేస్తే ప్రాణాలే హుష్ కాకయిపోతాయ్. ఇంతకీ ఏంటా మొక్క.? టచ్ చేస్తే ప్రాణాలు పోవడమేంటీ.? వివరాల్లోకి వెళదాం పదండి.

పచ్చదనానికి మారు పేరు మొక్కలు. ఆరోగ్యానికీ, ఆహ్లాదానికీ కేరాఫ్ అడ్రస్. మొక్కలుంటేనే మనకి సరిపడా ఆక్సిజన్ లభిస్తుంది. ఇవన్నీ పాత మాటలే కానీ, ఈ ప్రాణాలు తీసే మొక్క సంగతేంటో చెప్పమంటారా.? ఈ విచిత్రమైన మొక్క పేరు ‘గింపీ గింపీ’.  (Suicide Plant ) పేరు కూడా విచిత్రంగానే వుంది కదా.

హార్ట్ షేప్‌లో ఈ మొక్క ఆకులుంటాయ్. అదేనండీ రావి ఆకుల్లా అన్నమాట. ఆకులపై అక్కడక్కడా చిన్న చిన్న ముళ్లుంటాయ్. భలే ముచ్చటగా వుంది కదా.. అని టచ్ చేస్తే అంతే సంగతి ఆ ముళ్లు మన చేతి గుండా శరీరంలోకి చొచ్చుకుపోతాయ్. తీయడానికి ట్రై చేశామా.? తట్టుకోలేనంత బాధపెట్టేస్తాయ్. కాదు అలాగే వుంచేద్దామా.? అంటే అదో భరించలేని బాధాయె.

ఆ బాధ తట్టుకోలేక చివరికి సూసైడ్ చేసేసుకుందామా.. అనిపిస్తుందట అంత డేంజర్ మొక్క ఇది. ఆస్ట్రేలియాలో ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయట. ప్రపంచంలోనే అత్యంత హానికరమైన మొక్కల్లో ఇదీ ఒకటి అంటున్నారు. ఈ మొక్కఆకుల్లోని ముళ్లలో విషం వుంటుందట. ముల్లు గుచ్చుకోగానే ఆ విషం మన శరీరమంతటా వ్యాపించి తీవ్రమైన నొప్పితో కూడి, మెల్లమెల్లగా మన ప్రాణాల్ని హరించేస్తుందట.

ఆ విషం మన ప్రాణాల్ని తీసేలోపే, నొప్పి భరించలేక మనకే చచ్చిపోవాలనిపిస్తుందట. వామ్మో.! మొక్కే కదా అని, ముట్టుకుంటేనే ఎంత డేంజరో కదా.