Beauty Tips: ఈ ఫేస్ ప్యాక్ వల్ల నిమిషాలలో నిగనిగలాడే చర్మం మీ సొంతం..!

Beauty Tips: సాధారణ అందరూ అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొని వినియోగిస్తారు. వాటివల్ల అందం రెట్టింపు అయ్యే సంగతి అటుంచితే.. వాటివల్ల కలిగే దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా వాళ్ళ ఇంట్లో లభ్యమయ్యే కొన్ని పదార్థాల ద్వారా చర్మ సౌందర్యాన్ని పెంచుకొని అందంగా కనిపించవచ్చు. నిమిషాలలో ప్రకాశవంతమైన నిగనిగలాడే చర్మం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

అనుకోకుండా అప్పుడప్పుడు అనుకోకుండా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు బ్యూటీ పార్లర్ కు వెళ్లే సమయం లేక చాలా మంది తక్షణ నిగారింపు కోసం మార్కెట్లో దొరికే కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ముఖానికి రాసుకుంటూ ఉంటారు. బయట మార్కెట్లో చౌకగా లభించే వాటిలో అరటి పండు కూడా ఒకటి. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ప్రజలకు తక్కువ ధరకే దొరుకుతాయి. అరటి పండు వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగ పడుతుంది.

బాగా పండిన అరటి పండులో ఇథిలీన్ ఎక్కువగా ఉండటం చర్మం తొందరగా కాంతివంతంగా తయారవుతుంది. బాగా పండిన అరటి పండులో ఒక కోడి గుడ్డు పచ్చొన సొన వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

బాగా పండిన బొప్పాయిని తీసుకొని దానిని బుద్ధి చేయాలి. బొప్పాయి పండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనె, మూడు చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. బొప్పాయి పండు వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి.