Kidney Problems: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే..!

Kidney Problems:మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరం లోని అన్ని అవయవాలు సక్రమంగా పని చేయాలి. శరీర భాగాలలో ముఖ్యమైనవి గుండె, కిడ్నీలు. ఆధునిక కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యల భారిన పడుతున్నారు. మారిన జీవన విధానాలు, ఆహారపు అలవట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.కిడ్నీ ఫైల్యుర్, కిడ్నీ లో రాళ్లు పడటం వంటివి ఎక్కువ అయ్యాయి. కిడ్నీలు శరీరంలో ఉత్పన్నం అయ్యే మలినాలను బయటకు పంపడానికి ఎంతగానో సహాయపడతాయి. కిడ్నీ సమస్యలను ఆదిలోనే గుర్తు పట్టి తగిన చికిత్స తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. కిడ్నీ వ్యాధులు పలనా కారణంగా వస్తున్నాయి అని ఎవరు స్పష్టంగా చెప్పలేరు. మీకు గనుక క్రింద సూచించిన లక్షణాలు ఉన్నట్లయితే ఒక సారి డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

1. మధుమేహం, హై బీ. పీ., లేదా ఇంతకు మునుపు పెద్ద వాళ్ళలో ఎవరికైనా కిడ్నీ సంబందించిన వ్యాధులు ఉంటే వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం.
2. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా, మీరు వ్యాయామాలు లాంటివి చేయకుండా సడన్ గా బరువు తగ్గుతుంటే అది కిడ్నీ సమస్య అవ్వచ్చు.
3. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా కిడ్నీ లు శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను బయటకి పంపడానికి ఉపయోగపడతాయి. వీటి పని తీరు సరిగ్గా లేకుంటే ఆ మలినాలు శరీరం మొత్తం పాకి కళ్ళు, చేతులు, ముఖం వాపులు కనిపిస్తాయి.
4. తరచు మూత్రం వస్తున్నా, మూత్రం ఎర్రగా వస్తున్నా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
5.కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో మూత్రంతోపాటు రక్తస్రావం జరుగుతుంది.
6. శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోవటం వలన చర్మం మీద దద్దుర్లు వస్తాయి. చర్మం పొలుసులుగా మారుతుంది. ఆ దద్దుర్లు మీద రుద్దినపుడు చర్మం మీద గీతలు పడతాయి.
7. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉంటుంది. ఇది ఆరోగ్యవంతులలో వేడి చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ కిడ్నీ సమస్యలు ఉన్న వారు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు.

కిడ్నీసమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.కిడ్నీ లను హెల్తీ గా ఉంచుకోవాలి అంటే పుష్కలంగా నీరు త్రాగాలి. శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోవాలి. BP, షుగర్ అదుపులో పెట్టుకోవాలి. ఆల్కహాల్, ధూమపానం కిడ్నీల మీద ప్రభావం చూపుతాయి, వీటికి దూరంగా ఉండటం మంచిది. రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేస్తే శరీర భాగాలన్నీ యాక్టివ్ గా పనిచేస్తాయి. రాత్రి వేళ సరైన సమయంలో పడుకొని కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఇలా చేస్తే మీ కిడ్నీ ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.