బిగ్ బాస్ వేదిక‌పై క‌న్నీరు పెట్టుకున్న స్టార్ హీరో.. ఆ కార‌ణం ఏంటో తెలుసా?

ఆల్ ఇండియా లెవెల్ లో అద‌ర‌గొడుతున్న‌ బిగ్గెస్ట్ రియాలిటి షో బిగ్ బాస్. ఎంటర్ టైన్ మెంట్ కి కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాదు.. ఎన్నో భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తుంది బిగ్ బాస్. లేటెస్ట్ గా హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో రీసెంట్ ఎపిసోడ్ కంప్లీట్ యాక్షన్ కమ్ డ్రామా ఎపిసోడ్ గా నిలిచింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గార్డెన్ ఏరియాలో రుబినా దిలైక్, అభినవ్ శుక్లా, అలీ గోని తో పాటు జాస్మిన్ భాసిన్ కూడా ఉన్నారు. మిగిలిన హౌస్ మేట్స్ హిడెన్ రూమ్ లోపల నుండి గమనిస్తున్నారు.

అయితే ఈ ప్రోమోలో ఒకరిని ఒకరు హత్తుకుంటూ.. కనిపించారు. అభినవ్ రుబినాను కౌగిలించుకుని నుదిటిపై ముద్దు పెట్టుకుంటాడు. సల్మాన్ ఖాన్.. జాస్మిన్ ను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పడం, తద్వారా ఆమె ఏడవకూడదంటూ సల్మాన్ చెప్పడం జరుగుతుంది. జాస్మిన్‌పై స‌ల్మాన్‌కు ప్ర‌త్యేక అభిమానం ఉన్న నేప‌థ్యంలో ఆమె కోసం స‌ల్లూ భాయ్ కంట క‌న్నీరు పెట్టుకున్నాడు.అంతేకాదు హోస్ట్ గా సల్మాన్ ఖాన్ సారీ చెబుతూ సెండ్ ఆఫ్ ఇవ్వమంటారు. దీంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం శోకసంద్రంలో మునిగినట్లయ్యింది. సల్మాన్ ఖాన్ మొట్టమొదటి సారి భావోద్వేగానికి గురయ్యారు. రాఖీ సావంత్, రాహుల్, వికాస్ గుప్తా తో పాటు అభినవ్, జాస్మిన్ ల నుండి ఒకరు ఇంటిని విడిచిపెడుతున్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు ఈ ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సల్మాన్ ఖాన్ హౌస్ మేట్స్ ఉంటున్న ప్లేస్ లో కూర్చుంటారు. ఈరోజు వీకెండ్ వార్ లో సల్మాన్ ఖాన్.. అభినవ్, రుబినాలను దండించడం చూడొచ్చు. దీంతో పాటు బీటౌన్ బిగ్ బాస్ హౌస్ లో జబర్ధస్త్ మస్తీ దొరుకుతుంది. ప్రతి ఎపిసోడ్ లోనూ అద్దిరిపోయే సస్పెన్స్ తో పాటు అల్టీమేట్ టాస్క్ లతో సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ సీజన్ 14 రన్ అవుతుంది.