మురుగుదాస్‌ మూవీ పేరు ‘సికిందర్‌’

కోలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కాంబోలో ఓ మూవీ రానున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ.. రంజాన్‌ కానుకగా సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఏఆర్‌ మురుగదాస్‌, సల్మాన్‌ ఖాన్‌ కాంబోలో ఈ సినిమా రానుండగా.. ఈ చిత్రానికి ‘సికిందర్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇక ఈ సినిమాను నడియాద్వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సాజిద్‌ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2025 ఈద్‌ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు, టెక్నికల్‌ టీమ్‌ వివరాలు ఇంకా వెల్లడించలేదు.