ప్రభాస్ ఎవరో కూడా తెలియదు.. పిల్లలపై ఒట్టేసి క్లారిటీ ఇచ్చిన షర్మిల..

ప్రభాస్ కి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కి మధ్య ఉన్న సంబంధం గురించి మరోసారి రచ్చ జరుగుతుంది. షర్మిల ఈ విషయంపై మరోసారి స్పందించారు. ఏపీ మాజీ సీఎం జగన్ కి పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. అప్పుడే తనకి ప్రభాస్ కి ఉన్న సంబంధం గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు.

ప్రభాస్ ఎవరో తనకి తెలియదని, తన పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని, ప్రభాస్ ని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఈ విషయం జగన్ కి తెలిసినా కూడా మా ఇద్దరికీ ఏదో సంబంధం ఉంది అని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా అని జగన్ ని నిలదీశారు షర్మిల. జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మ పై కేసు పెడతారని, నాన్న పేరు సిబిఐ చార్జి సిటీలో పెడతారని, చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారని మండిపడ్డారు.

తనపై బాలకృష్ణ ఇంటి ఐ డి నుంచి దుష్ప్రచారం జరిగినట్లు ఒక వీడియో చూపించిన జగన్మోహన్ రెడ్డి సిస్టం ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే ఐదేళ్లు సీఎం గా ఉండి ఏమి చేశారు, గాడిదలు కాసారా అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభాస్ విషయంలో తనపై దుష్ప్రచారం జరుగుతున్న సమయంలో హైదరాబాదు సీపీకి ఫిర్యాదు చేసిన వెంటనే మీరు ఎందుకు స్పందించలేదని వ్యాఖ్యానించారు.

జగన్ కి ఇవన్నీ తెలిసి కూడా తనకి వ్యక్తిత్వం లేనట్లు ప్రచారం చేయించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను జగన్మోహన్ రెడ్డిని ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారని కానీ నేను మాట్లాడకుండా ఉండలేనని, కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉండే ఇలాంటి విషయాలు నేను మాట్లాడకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు షర్మిల.