Home News త‌న‌ జీవితానికి పెళ్ళే వద్దంటున్న సాయి పల్లవి.. ఒకవేళ అలాంటివాడైతే ఓకే..!

త‌న‌ జీవితానికి పెళ్ళే వద్దంటున్న సాయి పల్లవి.. ఒకవేళ అలాంటివాడైతే ఓకే..!

లైఫ్ అన్నాక ప్రతి ఒక్కరూ ఏదొక టైమ్ లో ఒకింటి వాళ్ళవ్వాల్సిందే.. కాస్త అటు ఇటు అవుతుందంతే.. కానీ ఈ టాపిక్ సాధారణ ప్రజల జీవితాల్లో కంటే సినీ సెలెబ్రిటీల జీవితాల్లో అయితే ప్రేక్షకులకు, అభిమానులకు మరింత ఆసక్తి నెలకొంటుంది. నిజానికి అదొక తాపత్రయం కూడా. ఈ మధ్య కాలంలో కొంత మంది హీరోయిన్లు తమ జీవితాల్లో అసలు పెళ్ళే చేసుకోమంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు. రీసెంట్ గా పాల బుగ్గల హన్సిక అలాంటి ఓ ప్రకటనే చేసింది. లేటెస్ట్ గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఇదే మార్గంలో వెళ్తానంటోంది. దాంతో ఆమె అభిమానులు ఇంత పెద్ద నిర్ణయానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నారు.

Sai Palllavi | Telugu Rajyam
ఇంతకీ ఆమె ఎందుకు అలా మాట్లాడిందంటే.. తన తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి పెళ్ళికి దూరంగా ఉంటానని అంటోంది. అచ్చం ఇలాంటి ఓ పాత్రలోనే, ఫిదా సినిమాలో నటించింది సాయి పల్లవి. తన తండ్రిని వదిలేసి ఉండలేక ఇష్టం లేని పెళ్ళినైనా చేసుకోవడానికి రెడీ అవుతుంది. అయితే రియల్ లైఫ్ లో మాత్రం అసలు పెళ్ళి కాకుండానే ఉండిపోతానని చెబుతోంది. పేరెంట్స్ కోసం జీవితంలో పెళ్ళి అనే అతిపెద్ద ఘట్టాన్ని త్యాగం చేయాలని ఫిక్సయిపోయిందట ఈ హైబ్రీడ్ పిల్ల.

అయితే తన పేరేంట్స్ తో కలిసి పోయి ఉండే అబ్బాయి.. తన పేరేంట్స్ లా ట్రీట్ చేసే అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్ళిచేసుకుంటానంటోంది ఈ డింపుల్ క్వీన్. అయితే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే అంటోంది. సాయి పల్లవి ప్రస్తుతం విరాట పర్వంతో పాటు నాగ చైతన్యకు జోడీగా లవ్ స్టోరీలో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు 2021 లోనే విడుదలకు సిద్దంగా ఉన్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Related Posts

Related Posts

Latest News