Acharya​ -Saana Kastam Lyrical : మరో మెగా సాంగ్ వచ్చేసింది!

Acharya​ -Saana Kastam Lyrical :మెగా స్టార్ చిరంజీవి ‘ఆచార్య’ లేటెస్ట్ సాంగ్ సోమవారం సాయంత్రం విడుదలైంది… ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ …చూసేవాళ్ళ కళ్ళు కాకులెత్తుకు పోనీ’ అనే పల్లవితో మెగాస్టార్ రెచ్చిపోతూ స్టెప్పులేసి అభిమానుల్ని ఊదరగొట్టారు. పాటలో జంటగా రెజీనా కసాండ్రా తన స్టెప్పులతో కవ్విస్తోంది. చిరు యంగ్ చిరులా బాడీని మెరుపులా వూపుతూ, డాన్స్ ఫ్లోర్ ని అదరగొట్టే పెప్పీ సాంగ్ ఇది. ఎప్పటిలాగే తన గ్రెస్ ని, ఈజ్ నీ మిక్స్ చేస్తూ శివలెత్తిపోయారు. థియేటర్లో గ్యారంటీగా ఇక కేకలే. మాస్ లవర్స్ కి ఈ పాత పండగే అన్నట్టుంది. సాంగ్ వీడియోని ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూస్తారు వీక్షకులు!

 

కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా షో. ఇప్పటికే ఇందులోని ‘లాహే లాహే’, నీలాంబరి’ సాంగ్స్ ని విడుదల చేసి క్రేజ్ సృష్టించారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ‘ సానా కష్టం’ సాంగ్ విడుదల చేశారు. అత్యధిక వ్యూవ్స్ తో వైరల్ అవుతోంది…

ఈ సాంగ్ తో మణిశర్మ మరోసారి తన బెస్ట్ డెలివరీ ఇచ్చారు. చేశారు. భాస్కర భట్ల రాసిన ఈ పాటని రేవంత్, గీతా మాధురి ఆలపించారు. దేవాదాయ శాఖ నేపథ్య కథతో రూపొందిస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలోకి రానుంది.