టాక్ : ‘RRR’, ‘రాధే శ్యామ్’ లకి బిగ్ షాక్ తప్పేలా లేదు.!

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాల్లో “RRR” అలాగే “రాధే శ్యామ్” సినిమాలు కూడా ఒకటి. రెండిటి పై కూడా ఆకాశాన్ని అంటే అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ రెండు భారీ సినిమాలు కూడా వచ్చే ఏడాది జనవరి సంక్రాంతి బరిలో ఫిక్స్ అయ్యాయి.

సరే ఇదంతా బాగానే ఉన్నా ఇలాంటి భారీ సినిమాలకి అసలు ఇబ్బందులు తప్పేలా లేవంట. ఏపీలో ఎప్పుడు నుంచో టికెట్ రేట్లు విషయం ఒక తీరని సమస్యలా పీడిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే టికెట్ రేట్ హైక్ అనేది ఎప్పుడు నుంచో ఉన్నదే కానీ సడెన్ గా తీసుకొచ్చిన కొత్త నిర్ణయాలు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కి భారం అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే టాక్ వినిపిస్తుంది. ఏపీలో అనేక ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు ముందు జరిగిన బిజినెస్ నుంచి కోత అడుగుతున్నారట.

అలా ఒక్క ‘RRR’ సినిమాకే 20 కోట్లు నష్టం రావడం పక్కా అని ఇండస్ట్రీలో టాక్. అలానే ఇంకో తాజా టాక్ ఏమిటంటే ఏపీలో ఇప్పుడప్పుడే ఈ టికెట్ రేట్ పెంచడం జరగదట. మరి ఈ సినిమాలు రిలీజ్ అయ్యేనాటికి కూడా ఇలాగే ఉంటే రికార్డులు మాట ఏమో కానీ భారీ నష్టాలు అయితే గ్యారెంటీ..