ఇండస్ట్రీ టాక్ : ఆ హీరో సినిమానే రామ్ చరణ్ తో చేస్తున్నాడా.?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏ లెవెల్లో ఉంటున్నాయో తెలిసిందే. ఇండియా టాప్ దర్శకులు రాజమౌళి శంకర్ లాంటి ఇద్దరు దర్శకులతో సినిమాల తర్వాత నెక్స్ట్ దర్శకుడు బుచ్చిబాబు సానా తో నిన్ననే చిత్ర యూనిట్ అయితే అనౌన్స్ చేశారు.

మరి దీనిపైనా మరిన్ని అంచనాలు నెలకొనగా అభిమానుల్లో ఇపుడు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ రచ్చ స్టార్ట్ అయ్యింది. అసలు ఈ సినిమా చరణ్ కోసం ప్రిపేర్ చేసిందా లేక బుచ్చిబాబు ముందు ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్న సినిమానా అని అంతా ఇప్పుడు అనుకుంటున్నారు.

నిజానికి బుచ్చిబాబు ఎన్టీఆర్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేసాడు ఎన్టీఆర్ కూడా దాన్ని ఓకే చేసాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఎన్టీఆర్ నుంచి చరణ్ కి మారింది అని భోగట్టా. అలాగే ఈ విషయం ఎన్టీఆర్ కి కూడా తెలుసనీ.

చరణ్ మరియు తారక్ లు మాట్లాడుకొనే ఈ సినిమా బుచ్చిబాబుతో చేయాలి అనుకుంటున్నట్టుగా కొన్ని రూమర్స్ ఇప్పుడు ఇండస్ట్రీ లో వినిపిస్తున్నాయి. అయితే ఇది మరోపక్క వేరే స్క్రిప్ట్ అని కూడా టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై అయితే మరింత సమాచారం బయటకి రావాల్సి ఉందని తెలుస్తుంది.