ఓటీటీలో అత్యంత ఆదరణ పొందిన చిత్రంగా ఆర్ఆర్ ఆర్?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలైనా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల నుండి ఆదరణ పొందింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. వీరిద్దరి నటనతో పాటు రాజమౌళి టేకింగ్ కూడా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటానికి ఒక కారణం అని చెప్పటంలో సందేహం లేదు.

ప్రస్తుతం ఈ సినిమా ఓటిటిలో కూడా స్ట్రీమ్ అవుతూ కొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ సంస్ధ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ ఓటిటిలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా హిందీ వెర్షన్ లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు 45 మిలియన్‌ అవర్స్‌ ఆర్‌ఆర్‌ఆర్ స్ట్రీమింగ్‌ అయ్యింది. ఈక్రమంలో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సంస్ధ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా విడుదలైన నాటి నుండి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టి టాప్ 2 లో నిలిచింది. మొదటి స్థానంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుండగా.. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ వెర్షన్‌లు ప్రముఖ ఓటీటీ సంస్ధ జీ5 వేదికగా స్ట్రీమ్‌ అవుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ఐమ్యాక్స్‌, 3డీ, డాల్బీ సినిమా వెర్షన్‌లోనూ విడుదల చేశారు. మొత్తానికి ఓటిటిలో అత్యంత ఆదరణ పొందిన సినిమాగా ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.