Actress Rekha: షూటింగ్ షిఫ్ట్ మారిస్తే అమితాబచన్ తో గడుపుతా అంటూ డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసిన నటి రేఖ.. ఆమెకు షాక్ ఇచ్చిన డైరెక్టర్!

Actress Rekha: బాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో మెగాస్టార్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న అమితాబచ్చన్ నటి రేఖ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్దఎత్తున వార్తలు షికార్లు చేశాయి. అయితే వీరి రిలేషన్ గురించి ఎప్పుడూ అమితాబచ్చన్ స్పందించకపోవడం గమనార్హం. కానీ వీరి మధ్య ఉన్న రిలేషన్ గురించి నటుడు రంజీత్ ఒకానొక సందర్భంలో బయటపెట్టారు. కేవలం నటి రేఖ తన ఒక షూటింగ్ విషయంలో రిక్వెస్ట్ చేస్తే ఏకంగా తనని సినిమా నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రంజిత్ పేర్కొన్నారు.

బాలీవుడ్ సినిమాలలో ఎప్పుడు నెగిటివ్ పాత్రలో నటించే రంజిత్ మొట్టమొదటిసారిగా 1990లో ‘కర్ణమ’ అనే సినిమాకి డైరెక్షన్ చేశాడు. ఈ సినిమాలో ధర్మేంద్ర హీరో కాగా.. రేఖ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ మొదలు పెట్టగానే నటి రేఖ తనకు ఒక రిక్వెస్ట్ చేశారని తన షూటింగ్ టైం మార్నింగ్ షిఫ్ట్ చేస్తే తన సాయంత్రం అమితాబచన్ తో గడుపుతానని చెప్పడంతో ఏకంగా తనని ఈ సినిమా నుంచి తప్పించామని నటుడు రంజిత్ ఒకానొక సమయంలో పేర్కొన్నారు.

అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని కారణాల వల్ల హీరో ధర్మేంద్ర కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాలు హీరో హీరోయిన్లుగా వినోద్ ఖన్నా, ఫరా రాజ్‌ నటించారని వీరితో ఈ సినిమా పూర్తి చేసి విడుదల చేశామని డైరెక్టర్ రంజిత్ ఒక సందర్భంలో నటి రేఖ గురించి ఈ విషయాన్ని బయటపెట్టారు. గతంలో నటి రేఖ అమితాబచ్చన్ గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై అమితాబచ్చన్ స్పందించకపోవడం గమనార్హం.