Rajamouli : ప్రస్తుతం భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భారీ సినిమా దర్శకుడు రాజమౌళి తీసిన విజువల్ చిత్రం “ట్రిపుల్ ఆర్(RRR)”. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం రిలీజ్ కి వస్తుండడంతో చిత్ర బృందం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే వారు ఒక్కో రాష్ట్రాన్ని టచ్ చేస్తూ వెళ్లిపోయారు.
అయితే నిన్న బెంగళూర్ లో రాజమౌళి తన టీం తో సినిమా ప్రమోషన్స్ కి వెళ్లగా అక్కడ ఓ మీడియా ఛానెల్ వారు అడిగిన ప్రశ్నకి రాజమౌళి ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ ఇప్పుడు ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. మన దగ్గర ఉన్న కొన్ని అతి ఛానెల్స్ లో టీవీ తొమ్మిది కూడా ఒకటి. అలాగే మన దగ్గర ఉన్నట్టే కన్నడలో కూడా ఉంది.
వారికే రాజమౌళి ఓ ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్పగలను కానీ మీరు మీ ఛానెల్లో ఆ ప్రశ్ననే హైలైట్ చేస్తూ స్క్రోలింగ్ లో వేస్తారు కానీ నా ఇప్పుడు తీసిన ట్రిపుల్ ఆర్ కోసం ఎక్కడా వెయ్యరు. అందుకే నేను మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పానని వారి మొహం మీదే చెప్పేసారు. దీనితో ఈ దిమ్మతిరిగే ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.