RRR : భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా “ట్రిపుల్ ఆర్(RRR)” కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోస్ తో రాజమౌళి పడ్డ మూడేళ్ళ కష్టం ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.
అయితే ఈ మూడేళ్ళ కష్టాన్ని మూడు నిమిషాల ట్రైలర్ లో చూపించి రాజమౌళి ఈ సినిమా పాన్ ఇండియన్ ప్రేక్షకుల్లో ఇంకో స్థాయిలో నిలబెట్టారు. అయితే అసలు ఈ భారీ ట్రైలర్ ఇంత రెస్పాన్స్ అందుకోవడానికి వేరే వ్యక్తి కారణం అని ఆ క్రెడిట్ ని రాజమౌళి అతడికి ఇచ్చేసారు.
అతడు మరెవరో కాదో ఈ వండర్ ఫుల్ ట్రైలర్ ని కట్ చేసిన ఎడిటర్ ప్రవీణ్. అతడిని మెన్షన్ చేసి మరీ ఈ ట్రైలర్ ఇంత భాయీ రెస్పాన్స్ అందుకోవడానికి కారణం ఎడిటర్ ప్రవీణ్ అని అతడి స్కిల్ ఈ ట్రైలర్ కి చాలా ఉపయోగపడింది అని నీ ఓపికకి, ఎఫర్ట్స్ కి థాంక్స్ చెబుతున్నాని బ్రదర్ అంటూ ఈ ట్రైలర్ రెస్పాన్స్ క్రెడిట్ ని అతడికి ఇచ్చాడు. దీనితో ఈ ట్రైలర్ వెనుక ఉన్న అతడిని అంతా గుర్తిస్తున్నారు.