Rahul Sipligunj: ఘనంగా రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం… అమ్మాయి ఎవరో తెలుసా?

Rahul Sipligunj : నాటు నాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అభిమానులకు శుభవార్తను తెలియజేశారు ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అనంతరం సినిమా ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలను అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా ఈయన పాడిన పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ ప్రస్తుతం సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈయన తాజాగా నిశ్చితార్థం చేసుకొని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు ప్రస్తుతం రాహుల్ హిరణ్య రెడ్డిల నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి నిశ్చితార్టానికి సంబంధించిన ఫోటోలను అధికారకంగా వెల్లడించక పోయిన సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి.

ఇక రాహుల్ హిరణ్య రెడ్డిది కులాంతర వివాహమని స్పష్టమవుతుందా అయితే ఇది ప్రేమ వివాహమా లేక పెద్దలకుదురుచిన వివాహం అనే విషయాలు ఎక్కడ వెల్లడించలేదు అలాగే రాహుల్  కాబోయే భార్య హిరణ్య ఏం చేస్తారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక మీరు నిశ్చితార్థం ఆగస్టు 17వ తేదీ హైదరాబాదులో కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగింది. ఇక రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో పాల్గొని విన్నర్ గా నిలిచారు. అయితే బిగ్బాస్ కార్యక్రమంలో కొనసాగిన సమయంలో రాహుల్ పలువురితో ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అవన్నీ నిజం కాదని స్పష్టమవుతుంది ప్రస్తుతం హిరణ్య రెడ్డితో రాహుల్ నిశ్చితార్థపు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.