Kajal Says Taggedhe Le : దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అనే నానుడి ముద్దుగుమ్మల విషయంలో చాలా చక్కగా కుదురుతుంది. అందులోనూ చందమామ కాజల్ అగర్వాల్ విషయంలో ఇంకా చక్కగా ఒదిగిపోతుంది. స్టార్ హీరోయిన్‌గా కాజల్ వెనకేసుకున్న రాళ్లు చాలా చాలా ఎక్కువే.
అంతేకాదు, ప్రకటనలు, ఇతరత్రా బిజినెస్ వ్యవహారాల ద్వారా కూడా కాజల్ రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన కాజల్ అగర్వాల్, సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. అయినా కానీ, సంపాదన విషయంలో నో బ్రేక్స్ అంటోంది. బేబీ బంప్‌ని ప్రమోట్ చేసుకుంటూ, సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ అయిపోయింది అందాల చందమామ.
ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే జాగ్రత్తలూ, చేయాల్సిన వ్యాయామాలూ.. ఇలా కాన్సెప్టు వైజ్‌గా పాఠాలు చెబుతూ వి వన్నా ఫాలో పాలో.. అంటోంది ఫాలోవర్స్‌ని. మరోవైపు కొన్ని ప్రత్యేకమైన యాడ్ షూట్స్‌లోనూ కాజల్ పాల్గొంటోంది. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తూ, ఇప్పుడు కూడా రెండు చేతులా ఫుల్‌గా సంపాదించేస్తోంది.
తాజాగా క్విల్ కంఫర్ట్ అనే ఓ పిల్లోని ప్రమోట్ చేస్తూ, కాజల్ సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. ప్రెగ్నెన్సీ సమయంలో సహజంగా వచ్చే నడుంనొప్పి, భుజం నొప్పి, మెడనొప్పి తదితర పెయిన్స్ నుంచి ఈ పిల్లో ఉపశమనం ఇస్తుందట. చాలా కంఫర్టబుల్‌గా వుందట ఈ ప్రెగ్నెన్సీ పిల్లో.
కూర్చోవడానికి, పడుకోవడానికి.. ఇలా కావాలంటే అలా మార్చుకునే ఏర్పాట్లున్నాయ్ ఈ పిలోకి. కాజల్ చెప్పిందని కాదు కానీ, ఆమె చేసిన ప్రమోషన్స్ చూస్తుంటే, నిజంగానే ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఈ పిల్లో కంఫర్టబుల్ అనిపిస్తోంది. లెట్స్ హేవ్ ట్రైల్ వన్స్.!