Kajal: ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్న కాజల్.. కంగ్రాట్స్ చెబుతున్న అభిమానులు!

Kajal: సినీనటి కాజల్ అగర్వాల్ సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయం అయిన ఈమె తన మొదటి సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక అనంతరం చందమామ మగధీర వంటి సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ వరుస తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన కాజల్ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక పెళ్లి తర్వాత వెంటనే ఈమె ప్రెగ్నెంట్ కావడం బాబుకు జన్మనివ్వడం కూడా జరిగింది. ఇలా పెళ్లి తర్వాత కొత్త కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన కాజల్ తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇలా పలు సినిమాలలో నటించిన ఈమె తిరిగి ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలుస్తుంది. ఈమెకు ఎంతో మంచి మంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ కూడా వాటినే రిజెక్ట్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఇటీవల కాలంలో కాజల్ మరింత బొద్దుగా మారిపోవడంతో రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యారని మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఇలా కాజల్ మరోసారి తల్లి కాబోతున్నారని విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. సరైన సమయానికి పెళ్లి పిల్లలు అంటూ ఈమె తన వ్యక్తిగత జీవితానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి. మరి కాజల్ రెండోసారి తల్లి కాబోతున్నారు అంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.